News March 4, 2025

సూర్యాపేట: టీచర్ అవతారమెత్తిన కలెక్టర్..

image

సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధ్యాపకుడి అవతారం ఎత్తారు. మంగళవారం చివ్వెంల మండల పరిధిలోని ఐలాపురం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. పలు సబ్జెక్టుల్లో విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఉన్నారు.

Similar News

News November 9, 2025

మామిడిలో ఆకుతినే పురుగు నివారణకు సూచనలు

image

మామిడిని ఆకుతినే పురుగు ఆశించి పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు అజాడిరక్టిన్(3000 పి.పి.ఎం.) 300 మి.లీ.లతోపాటు ఎసిఫేట్ 75% ఎస్.పి. 150 గ్రా. లేదా క్వినాల్‌ఫాస్ 25% ఇ.సి. 200ml లేదా ప్రొఫెనోఫోస్ 50% ఇ.సి. 200ml లలో ఏదైనా ఒక దానిని 100 లీటర్ల నీటికి కలిపి చెట్టు పూర్తిగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. అలాగే మామిడి తోటలో కలుపు మొక్కలు లేకుండా శుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి.

News November 9, 2025

విషాదం.. విద్యుదాఘాతంతో లైన్‌మన్‌ మృతి

image

ఖమ్మం రూరల్ మండలంలోని బారుగూడెంలో విద్యుత్ పనులు చేస్తుండగా, కైకొండాయిగూడెంకు చెందిన లైన్‌మన్ టీ.గోపీ (26) శనివారం విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లైన్ క్లియర్ తీసుకున్నా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతోనే ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తన భర్త మరణించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

News November 9, 2025

విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం.. ముందే చెప్పామన్న ATC

image

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 2 రోజుల క్రితం తలెత్తిన తీవ్ర సాంకేతిక సమస్య గురించి తాము కొన్ని నెలల ముందే గుర్తించి చెప్పామని ATC పేర్కొంది. అహ్మదాబాద్ ప్రమాదం తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎయిర్ నావిగేషన్ వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేయాలని AAIకి లేఖ రాసినట్లు వెల్లడించింది. కానీ తమ సూచనలను పట్టించుకోలేదంది. ఢిల్లీ, ముంబై ఎయిర్‌పోర్టుల్లో ATC వ్యవస్థ కుప్పకూలి 800కు పైగా విమానాలపై ప్రభావం చూపింది.