News March 20, 2025
సూర్యాపేట: త్వరలో ప్రారంభం కానున్న ఇందిరమ్మ ఇళ్లు

సూర్యాపేట జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో 4,140 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడంతో త్వరలో ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. నాలుగు నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3,500 మంది చొప్పున లబ్ధిదారులకు మేలు జరగనుంది. జిల్లాలో ఈ పథకానికి 3,09,062మంది దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News March 20, 2025
ఫోన్ పే, గూగుల్ పే ఉపయోగిస్తున్నారా?

ఏప్రిల్ 1 నుంచి NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొత్త మార్గదర్శకాలు అమలు చేయనుంది. ఈ రూల్స్ ప్రకారం డియాక్టివేట్, సరెండర్ చేసిన మొబైల్ నంబర్లను ఈ నెల 31లోగా తొలగించాలని బ్యాంకులను ఆదేశించింది. ఆ తర్వాత ఈ నంబర్లను ఉపయోగించి ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ సేవలు పొందలేరని తెలిపింది. అప్డేట్ చేసిన మొబైల్ నంబర్ సిస్టమ్‌ను ఉపయోగించి ట్రాన్సాక్షన్ల సంఖ్యను పేర్కొనాలని సూచించింది.
News March 20, 2025
BREAKING: నారాయణపేటలో MURDER

కట్టుకున్న భార్యను గొంతు నులిమి హత్య చేసిన ఘటన గురువారం NRPTలో వెలుగులోకి వచ్చింది. ఇన్‌ఛార్జ్ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలు.. నారాయణపేట మండలం గోపితండాకు చెందిన శారు నాయక్(20), వినోద్ నాయక్ భార్యాభర్తలు. భార్య తనకు ఇష్టం లేదని భర్త తరుచూ గొడవ పడేవాడు. ఈ క్రమంలో భార్య శారు నాయక్‌ను బుధవారం రాత్రి భర్త గొంతు నులిమి హత్య చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ చెప్పారు.
News March 20, 2025
వల్మీడి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన MLA

పాలకుర్తి మండలం వల్మీడి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను అధికారులతో కలిసి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆవిష్కరించారు. సీతారాముల కళ్యాణం ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని, వేలాది మంది భక్తులు హాజరయ్యే ఈ మహోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయం పరిసరాలను శుభ్రంగా ఉంచి,తాగునీరు, పారిశుధ్యం, తదితర అందుబాటులో ఉంచాలని సూచించారు.