News March 26, 2025
సూర్యాపేట: ధాన్యం కొనుగోలుకు సన్నద్ధమవుతున్న యంత్రాంగం

సూర్యాపేట జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు ఉండొద్దని ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభించేలా సివిల్ సప్లై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 4,73,739 ఎకరాల్లో వరిసాగు చేయగా దాదాపు 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనాలు వేశారు.
Similar News
News November 9, 2025
విశాఖ: మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

విశాఖలో ఓ వివాహిత శనివారం ఆత్మహత్య చేసుకుంది. గోపాలపట్నం పోలీసుల వివరాల ప్రకారం.. లక్ష్మినగర్‌కు చెందిన టి.రమ ఓ దుకాణంలో పనిచేస్తోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకునేవాడు కాదు. ఎన్నిసార్లు నచ్చజెప్పినా మారలేదు. దీంతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని చనిపోయింది. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 9, 2025
పాలలో వెన్నశాతం పెరగాలంటే?(1/2)

పశువులకు ఇచ్చే దాణాలో కొబ్బరి చెక్క, పత్తి గింజల చెక్క, వేరుశనగ చెక్క, సోయాగింజల చెక్క, పొద్దు తిరుగుడు చెక్క వంటివి ఇవ్వాలి. పశువులకు అందించే మేతలో 1/3వ వంతు ఎండు గడ్డి ఉండాలి. పప్పు జాతి గ్రాసాలైన లూసర్న్, పిల్లి పెసర, జనుము తదితర వాటిని గడ్డి జాతి గ్రాసాలతో కలిపి ఇవ్వాలి. పశుగ్రాసాలను చాప్ కట్టర్ ద్వారా చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి ఇవ్వాలి. దాణాను వీలైనంత వరకు నానబెట్టి పశువుకు ఇవ్వాలి.
News November 9, 2025
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ఉద్యోగాలు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ 5 పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. వీటిలో ల్యాబ్ అటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, డెమాన్‌స్ట్రేటర్ పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు, వయసు, ఎంపిక ప్రక్రియ తదితర వివరాలు పూర్తి స్థాయి నోటిఫికేషన్‌లో వెల్లడించనున్నారు. వెబ్‌సైట్: https://handlooms.nic.in/


