News February 23, 2025
సూర్యాపేట: నకిలీ పోలీస్ మోసం

SRPT జిల్లాలో నకిలీ డీఎస్పీ ఉదంతం బయటకు వచ్చింది. మఠంపల్లి చెందిన యువకుడు కారు డ్రైవర్. తను డీఎస్పీనని APకి చెందిన మహిళను నమ్మించినట్లు సమాచారం. SI జాబ్ ఇప్పిస్తానని రూ.32 లక్షలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. చాలా రోజులు ఎదురు చూసిన ఆమె మోసపోయినట్లు గ్రహించి మఠంపల్లి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Similar News
News February 23, 2025
నిలకడగా ఆడుతున్న పాక్.. షకీల్ ఫిఫ్టీ

భారత్‌తో జరుగుతున్న మ్యాచులో పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. 10 ఓవర్లలోపే రెండు వికెట్లను కోల్పోగా ఆ తర్వాత వచ్చిన షకీల్(50*), రిజ్వాన్(41*) ఆచితూచి ఆడుతున్నారు. దీంతో ఆ జట్టు 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. భారత బౌలర్లు వికెట్ల కోసం శ్రమిస్తున్నారు.
News February 23, 2025
మిర్చి రైతులను ఉద్ధరించినట్లు కూటమి గప్పాలు: షర్మిల

AP: మిర్చి రైతులకు రూ.11 వేల మద్దతు ధర ఇచ్చి ఏదో ఉద్ధరించినట్లు కూటమి ప్రభుత్వం గప్పాలు కొడుతోందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. రైతులపై ప్రభుత్వానికి ప్రేమ ఉంటే రూ.26వేల కనీస ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. అండగా నిలవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం రైతుల కళ్లలో కారం కొడుతుందని దుయ్యబట్టారు. టమాటా రైతులనూ ఆదుకోవాలన్నారు. ధరలు పడిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News February 23, 2025
6,463 మంది పరీక్షలు రాశారు: అనంత కలెక్టర్

అనంతపురం జిల్లాలోని 14 సెంటర్లలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మొదటి పేపర్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మొత్తం 7,293 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. అందులో 6,463 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, 830 మంది అభ్యర్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. 88.61% ప్రజెంట్ పోల్ అయినట్లు ఆయన తెలిపారు.