News February 18, 2026
సూర్యాపేట: నెల రోజుల్లో మాతా శిశు కేంద్రం సిద్ధం కావాలి: కలెక్టర్

సూర్యాపేట మాతా శిశు కేంద్రం భవన పనులను నెల రోజుల్లో పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన, వైద్య పరికరాల కోసం ప్రతిపాదనలు పంపాలన్నారు. కోదాడ ఘటనపై స్పందిస్తూ.. పిల్లలను వద్దనుకునే వారు వారిని రోడ్డుపై వదలకుండా ఆసుపత్రిలోని ‘ఉయ్యాల’లో ఉంచాలని తల్లులకు సూచించారు.
Similar News
News February 19, 2026
ట్రంప్ ఆదేశమే ఆలస్యం.. ఇరాన్‌పై దాడికి US ఆర్మీ సిద్ధం: CNN

ఇరాన్‌పై దాడి చేసేందుకు అమెరికా మిలిటరీ సర్వం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ వీకెండ్‌లోనే అటాక్ చేసే ఛాన్స్ ఉందని CNN తెలిపింది. 2003 ఇరాక్ యుద్ధం తర్వాత మిడిల్ ఈస్ట్‌లో US తన అతిపెద్ద ఎయిర్ పవర్‌ను మోహరించినట్లు పేర్కొంది. ట్రంప్ తన అడ్వైజర్లతో కీలక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. ఇరాన్ అణు కేంద్రాలే టార్గెట్‌గా ఈ దాడులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
News February 19, 2026
అమెరికా అమ్మాయి.. తిరుపతి అబ్బాయి లవ్

తిరుపతికి చెందిన BSNL రిటైర్డ్ ఉద్యోగి రాజేంద్రన్ పెద్ద కుమారుడు రికీ జోసెఫ్(35) ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడే PhD పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అతడికి అమెరికా యువతి బ్రాండీ నొయెల్ల జెడ్(30)తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఆమె MS చదివి ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్ చేస్తోంది. ఇరుకుటుంబాల పెద్దలు వారి ప్రేమను అంగీకరించడంతో బుధవారం వారికి ఎంగేజ్‌మెంట్ జరిగింది.
News February 19, 2026
ములుగు: పోలీసుల అదుపులో దామోదర్?

ములుగు జిల్లాలో మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి దామోదర్ పోలీసుల అదుపులోకి వచ్చారనే సమాచారం చర్చనీయాంశమైంది. గత వారం రోజులుగా మహాముత్తారం, ఏటూరునాగారం అడవుల్లో విస్తృత కూంబింగ్ నిర్వహించిన పోలీసులు.. కీలక విజయాన్ని సాధించినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. మూడు నెలలుగా దామోదర్ ములుగు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్నాడనే వినికిడి ఉంది. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.


