News April 6, 2025
సూర్యాపేట: నేటి నుంచి నెల రోజులపాటు పోలీసు యాక్ట్

సూర్యాపేట జిల్లా పరిధిలో నేటి నుంచి నెల రోజులపాటు పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పరిధిలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా మీటింగులు, ర్యాలీలు, ఊరేగింపులను నిర్వహించొద్దని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నేరమని తెలిపారు. జిల్లాలో డీజే సౌండ్‌లను వినియోగించడంపై నిషేధం కొనసాగుతుందని తెలిపారు.
Similar News
News April 7, 2025
టారిఫ్స్.. బ్యూటిఫుల్ థింగ్: ట్రంప్

టారిఫ్స్ నిర్ణయం US భవిష్యత్తుకు ఎంతో కీలకమన్న విషయం ఏదో ఒకరోజు ప్రజలు తెలుసుకుంటారని ట్రంప్ వ్యాఖ్యానించారు. తన నిర్ణయాలపై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ ఆయన ఇలా స్పందించారు. ‘చైనా, ఈయూ సహా ఎన్నో దేశాలతో మనకు ఆర్థిక లోటు ఉంది. టారిఫ్స్ విధించడమే ఈ సమస్యకు పరిష్కారం. ఇదొక బ్యూటిఫుల్ థింగ్. ఈ నిర్ణయంతో $బిలియన్ల ఆదాయం వస్తుంది. జో బైడెన్ మిగిల్చిన లోటును అతిత్వరలో పూడ్చుతాం’ అని పేర్కొన్నారు.
News April 7, 2025
జగన్ పర్యటనను అడ్డుకుంటాం: MRPS

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు నియోజకవర్గ పర్యటనను అడ్డుకుంటామని MRPS క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ బీసీఆర్ దాస్ హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇచ్చిన తర్వాతే జిల్లా పర్యటనకు రావాలని స్పష్టం చేశారు. మండలిలో ఈ బిల్లుకు మద్దతు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. తమ నేతలతో కలిసి జగన్ పాపిరెడ్డి పర్యటనను అడ్డుకుంటామని ప్రకటన విడుదల చేశారు.
News April 7, 2025
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. పెద్దల సమక్షంలో పెళ్లి!

ఆదోని మండల పరిధిలోని పెద్దహరివాణం గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలానికి చెందిన యువతికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యారు. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి శ్రీరామనవమి రోజున ఒక్కటయ్యారు. నిండు నూరేళ్లు చల్లగా జీవించాలని కుటుంబ సభ్యులు వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.