News April 18, 2025
సూర్యాపేట: పొలం కోయిస్తుండగా కనిపించిన మృతదేహం

వరి పొలంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపిన ఘటన మునగాలలో గురువారం చోటుచేసుకుంది. మునగాలకు చెందిన తూముల వీరస్వామి పొలంలో హార్వెస్టర్‌తో పొలం కోయిస్తుండగా మృతదేహం కనిపించడంతో భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే వీరస్వామి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు.
Similar News
News April 19, 2025
పేరుపాలెం బీచ్‌లో గల్లంతైన యువకుడి మృతి

పేరుపాలెం బీచ్‌లో స్నానం చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని నల్లజర్ల మండలం ప్రకాశరావు పాలెంకు చెందిన సంకెళ్ల ఉదయ్ కిరణ్ (20) స్నానానికి వచ్చాడు. అలల ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందాడు. మృతదేహాన్ని నరసాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరో యువకుడు భీమవరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
News April 19, 2025
రేపు జిల్లాకు రానున్న ఎంపీ మాగుంట

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకాశం జిల్లాలో ఆదివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మాగుంట కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించనున్న సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎంపీ పాల్గొంటారు. 21వ తేదీన సాయంత్రం మార్కాపురంలోని చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరవుతారు.
News April 19, 2025
మేలో మరో ప్రయోగం చేపట్టనున్న ఇస్రో

మే నెల 22వ తేదీన ‘GSLV F-16’ రాకెట్ ప్రయోగానికి ఇస్రో సన్నాహాలు చేస్తుంది. ఈ రాకెట్ ద్వారా అమెరికాకు చెందిన నిషార్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లోని రెండవ ప్రయోగ వేదిక వద్దనున్న వెహికల్ అసెంబ్లీ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధాన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.