News December 14, 2025
సూర్యాపేట: పోలింగ్‌కు సర్వ సిద్ధం

రెండో దఫా పల్లె పోరుకు ఎన్నికల అధికారులు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి సిద్ధం చేశారు. పోలింగ్‌కు బూత్‌లు, బ్యాలెట్ పత్రాలపై ఎన్నికల అధికారుల సంతకాలు, ముద్రలు, పోలింగ్ ఏజెంట్‌లకు పాస్‌లు ఇవ్వడం పోలింగ్ కేంద్రం గోడలపై పోటీ చేసే అభ్యర్థుల గుర్తులు, పేర్ల పోస్టర్‌లు అంటించి సిద్ధం చేశారు. ఏజెంట్ల ముందు బాక్స్‌లు సీల్ ఓపెన్ చేసి ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది.
Similar News
News April 14, 2026
భీమవరం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జయంతి

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అసమానతల తొలగింపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News April 14, 2026
850కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు!

లోక్‌సభ సీట్లను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించనుంది. ఆర్టికల్ 55, 81కు సవరణలు చేపట్టనుంది. ఈ మేరకు ఎంపీలకు సమాచారం ఇచ్చింది. 16, 17, 18 తేదీల్లో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుతో పాటు దీనిపైనా చర్చ జరగనుంది.
News April 14, 2026
బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి

బిహార్ కొత్త సీఎంగా బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పేరు ఖరారైంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఆయనను అధికారికంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల అధినేతలు ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా సీఎం పదవికి కాసేపటి క్రితం నితీశ్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.


