News October 5, 2025
సూర్యాపేట: పోలీస్ వాహన విడిభాగాలకు బహిరంగ వేలం

సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖకు చెందిన వాహనాలకు సంబంధించిన ఉపయోగించిన బ్యాటరీలు, టైర్లు, ఇతర విడిభాగాలను బహిరంగ వేలం వేయనున్నట్లు ఎస్పీ నరసింహ తెలిపారు.ఈనెల 6న ఉదయం 10 గంటలకు ఇందిరమ్మ కాలనీలోని పాత ఎస్పీ కార్యాలయంలో బహిరంగ వేలం పాట ఉంటుందని తెలిపారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాలకు 8712686019 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News October 5, 2025
టార్గెట్ జూబ్లీహిల్స్.. నేడు బీజేపీ కీలక సమావేశం

స్థానిక ఎన్నికల సమరానికి కమలదళం సమాయత్తమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, జుబ్లీహిల్స్ ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు పార్టీ నాయకత్వం నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు అధ్యక్షతన జరగనున్న పదాధికారుల సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. స్థానిక ఎన్నికల సన్నద్ధత, జూబ్లీహిల్ ఉపఎన్నిక అభ్యర్థిత్వంపై చర్చించనుంది.
News October 5, 2025
యాదాద్రి: శిక్షణకు రాని ప్రిసైడింగ్ అధికారులపై చర్యలు: కలెక్టర్

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 6న ప్రతి మండల కేంద్రంలో నిర్వహించే శిక్షణా తరగతులకు ప్రిసైడింగ్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. శిక్షణకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. లీవ్‌లో ఉన్నవారు సైతం లీవ్‌ను రద్దు చేసుకుని విధిగా శిక్షణకు రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News October 5, 2025
అంతర్జాతీయ క్రికెట్ పోటీల్లో ఆడనున్న కోటబొమ్మాళి యువకుడు

కోటబొమ్మాళికి చెందిన ఈశ్వర్ రెడ్డి అంతర్జాతీయ T20 క్రికెట్ టోర్నమెంట్‌లో ఆడేందుకు అవకాశం దక్కింది. సెప్టెంబర్ 9-14 వరకు ఒడిశాలో జరిగిన జాతీయ T10 టెన్నిస్ క్రికెట్ పోటీల్లో ఆల్ రౌండర్‌గా సత్తా చాటాడు. ఈ మేరకు డిసెంబర్ 25-31 వరకు థాయిలాండ్‌లో జరగనున్న సెకండ్ ఏషియన్ టెన్నిస్ బాల్ క్రికెట్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొనాలని ఇండియా సెలక్షన్ టీం సెక్రటరీ నుంచి ఇవాళ లేఖ అందిందని క్రీడాకారుడు చెప్పారు.