News December 4, 2025

సూర్యాపేట: పోస్టల్ బ్యాలెట్‌లు జాగ్రత్తగా జారీ చేయాలి: కలెక్టర్

image

మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులపై రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారులు పోస్టల్ బ్యాలెట్లను జాగ్రత్తగా జారీ చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. పోలింగ్ అనంతరం ఓట్లను కౌంటింగ్ చేయడానికి తగిన ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News December 4, 2025

GNT: మారువేషంలో వచ్చి.. మార్చూరీలో తనిఖీలు

image

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి మరోసారి మారువేషంలో ఆసుపత్రిలోని అడ్మినిస్ట్రేషన్ తీరును పరిశీలించారు. ఈసారి ఆయన టీషర్ట్, మడత వేసిన ప్యాంటు, మాస్క్, మంకీ క్యాప్ ధరించి మార్చూరీ బయట సాధారణ వ్యక్తిలా ఒక గంటపాటు కూర్చున్నారు. అక్కడే ఉండి, మృతదేహాల బంధువులతో మాట్లాడి, మార్చూరీలోని పరిస్థితులను అధ్యయనం చేశారు.

News December 4, 2025

స్మార్ట్ సిటీ పెండింగ్ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్

image

తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ 41వ బోర్డు సమావేశంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌లో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఛైర్మన్, కలెక్టర్ డా. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా పాల్గొన్న ఎండి, కమిషనర్ ఎన్. మౌర్య సీసీ కెమెరాల ఏర్పాటు, కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇతర పెండింగ్ పనుల పురోగతిని వివరించారు. స్మార్ట్ సిటీ నిధుల మంజూరుపై ప్రభుత్వానికి లేఖ రాయాలని కలెక్టర్ సూచించారు.

News December 4, 2025

నెల్లూరులో 5,198 మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ నమోదు..!

image

లోక్ సభలో నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి AP, నెల్లూరులో SHG కింద ఉన్న మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌‌పై ప్రశ్నించారు. MSME పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరండ్లాజే మాట్లాడుతూ.. MSME పరిశ్రమల రిజిస్ట్రేషన్‌‌కు ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను 1జులై2020న ప్రారంభించామన్నారు. అప్పటి నుంచి మైక్రో ఎంటర్‌ ప్రైజెస్‌ 30 నవంబర్ 2025 నాటికి APలో SHGల తరఫున 1,30,171, నెల్లూరులో 5,198 నమోదయ్యాయన్నారు.