News March 19, 2025
సూర్యాపేట: ప్రజలు వెయిటింగ్.. బడ్జెట్ ఓకేనా!

అసెంబ్లీలో ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా దానిపై జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. సూర్యాపేటలో ఆటోనగర్‌లో IT కారిడార్ ఏర్పాటు, SRSP కాల్వలకు నిధులు, MG యూనివర్సిటీకి ఫండ్స్, తుంగతుర్తిలో డిగ్రీ కళాశాల, ఐటీఐ కళాశాలను ఏర్పాటు కోసం ఇక్కడి ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి కీలక శాఖలకు ఇద్దరు మంత్రులుగా ఉండడంతో బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News July 5, 2025
PNB కేసు.. నీరవ్ మోదీ సోదరుడు అరెస్ట్

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన్ను ఈనెల 4న అరెస్ట్ చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అతడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)ను రూ.14వేల కోట్లకు మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నేహాల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
News July 5, 2025
రోజుకు 10 గంటలు పని చేసేందుకు అనుమతి

TG: వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగులు రోజుకు 10 గంటల వరకు పనిచేసేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం GO జారీ చేసింది. వారంలో పనివేళలు 48 గంటలకు మించరాదని <
News July 5, 2025
విశాఖ: 100% సబ్సిడీతో ట్రాన్స్‌పాండర్లు

విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చెందిన బోట్లకు ట్రాన్స్పాండర్లను ప్రభుత్వం అందజేసింది. 634 బోట్లకు 100% సబ్సిడీతో వీటిని సమకూర్చారు. వీటి ద్వారా సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లను పర్యవేక్షించవచ్చు. సముద్రంలో బోట్లు ఉన్న స్థానాన్ని తెలుసుకోవచ్చు. వర్షాకాలం కావడంతో తుఫానులు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వీటి ఉపయోగం ఎంతో ఉందని బోట్ల యజమానులు తెలిపారు.