News March 18, 2025
సూర్యాపేట: ప్రజావాణి కార్యక్రమానికి 62 దరఖాస్తులు

ప్రజవాణిలో సరైన రీతిలో అర్జీదారులకు సమాధానమిస్తూ పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం 62 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి వచ్చే ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News March 18, 2025
ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమా

ప్రదీప్ రంగనాథన్, అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. ఈ నెల 21 నుంచి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ సౌత్ ఇండియా ట్వీట్ చేసింది. కాలేజీ జీవితం, నిజాయితీపై అశ్వత్ మారిముత్తు తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.
News March 18, 2025
విశాఖ: టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు?

విశాఖలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు అమరావతి చేరుకున్నట్లు సమాచారం. కార్పొరేషన్‌లో బలం పెరిగాక మేయర్‌పై అవిశ్వాసం పెట్టే యోచనలో కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల చేరికపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.
News March 18, 2025
వైసీపీకి షాక్: వైజాగ్ మేయర్‌పై అవిశ్వాసం?

AP: విశాఖ నగరపాలకసంస్థలోని వైసీపీకి చెందిన 9 మంది కార్పొరేటర్లు కాసేపట్లో టీడీపీ, జనసేన పార్టీల్లో చేరనున్నారు. ఇందుకోసం వారు అమరావతి చేరుకున్నారు. వీరితో కలుపుకొని జీవీఎంసీలో కూటమి సభ్యుల బలం 75కు చేరనుంది. అనంతరం జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం GVMCలో 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు.