News October 15, 2025
సూర్యాపేట: ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలి: ఎస్పీ

ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. బుధవారం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పోలీసు ప్రజా భరోసాలో భాగంగా అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రావీణ్యం ఉన్న అంశాలపై సాధన చేయాలని, చెడు అలవాట్లకు, చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రుల కష్టం చాలా విలువైనదన్నారు. అనంతరం డ్రగ్స్, సైబర్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు.
Similar News
News October 15, 2025
తుంగతుర్తి: దామోదర్ రెడ్డి చిత్రపటానికి ఎంపీ చామల నివాళి

తుంగతుర్తిలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి చిత్రపటానికి బుధవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సర్వోత్తమ్ రెడ్డిని పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించారు. కాంగ్రెస్ ఒక మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని వీడలేదని ఆయన గుర్తు చేసుకున్నారు.
News October 15, 2025
సీఎంఆర్ సమర్పించిన వారికే ధాన్యం: వనపర్తి కలెక్టర్

గత ఖరీఫ్ సీజన్ 2024-25లో వరి ధాన్యం పొందిన వారిలో వంద శాతం CMR సమర్పించిన వారికే ఖరీఫ్ 2025-26 సీజన్ ధాన్యం కేటాయిస్తామని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం NIC కాన్ఫరెన్స్ హాల్‌లో అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్‌తో కలిసి రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నవంబర్ 12లోపు పెండింగ్ సీఎంఆర్ పూర్తి చేసి కొత్త ధాన్యం పొందడానికి సహకరించాలని రైస్ మిల్లర్లకు సూచించారు.
News October 15, 2025
రోడ్డు భద్రత కోసం అన్నమయ్య పోలీసుల ‘బొమ్మ’ కథ

ప్రమాదాల సంఖ్య పెరుగుతున్న రహదారులపై ప్రాణాలను కాపాడేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తుపాకులు, లాఠీల కంటే సృజనాత్మక ఆలోచనే గొప్ప ఆయుధం అని నిరూపించేలా, మదనపల్లె సబ్-డివిజన్ యంత్రాంగం ఒక వినూత్న ‘కటౌట్ కథ’ ను ప్రారంభించింది. కానిస్టేబుల్ ఆకారపు బొమ్మను ఉంచారు. ఈ కటౌట్‌లను చూసిన వాహనదారులు, నిజంగానే పోలీసులు తనిఖీ అని భ్రమపడి, వెంటనే వేగాన్ని తగ్గించుకుంటున్నారు.