News March 21, 2024
సూర్యాపేట: బాలికపై అత్యాచారం.. 10 ఏళ్ల జైలు శిక్ష

బాలికను బంధించి అత్యాచారం చేసిన వ్యక్తికి రాజేంద్రనగర్‌లోని ప్రత్యేక కోర్టు 10 ఏళ్ల జైలుశిక్ష వేసింది. జడ్జి ఆంజనేయులు తీర్పు వెలువరించారు. హుజూర్‌నగర్‌కు చెందిన బాలిక కుటుంబం గచ్చిబౌలి వినాయకనగర్‌లో ఉంటోంది. బాలికపై అక్కడే నివసించే శివకృష్ణ కన్ను పడింది. 2014 అక్టోబర్ 20న ఇంట్లో నిద్రిస్తున్న బాలికను శివకృష్ణ కిడ్నాప్ చేసిన అత్యాచారం చేశారు. తాజాగా కోర్టు తీర్పునిచ్చింది.
Similar News
News October 25, 2025
నల్గొండ: పెరగనున్న ఎరువుల ధరలు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వచ్చే యాసంగి సీజన్లో సాగుచేసే పంటలకు వేసే ఎరువుల ధరలు మరింత భారం కానున్నాయి. తాజాగా కొన్ని కాంప్లెక్స్ ఎరువుల ధరలు సంచికి రూ.50 పెరగ్గా మరి కొన్నింటికి 50కిలోల బస్తాపై రూ.25 నుంచి రూ.వంద వరకు ధరల పెంపు ఉంటుందని ఎరువుల దుకాణాల డీలర్లకు కంపెనీలు సమాచారం ఇచ్చాయి. ప్రస్తుతం పాత నిల్వలు ఉండడంతో గతంలో ఉన్న ధరలకే విక్రయిస్తున్నారు. పెరగనున్న ఎరువుల ధరలు రైతులకు భారం కానున్నాయి.
News October 25, 2025
NLG: బీసీ, ఎస్సీలకు ఎక్కడ అవకాశం ఇస్తారో..!

డీసీసీలు ఇవాళ ఖరారు కానున్నారు. ఢిల్లీలో అధిష్ఠానంతో రాష్ట్ర ముఖ్య నేతల భేటీలో జిల్లా అధ్యక్షులను ఎంపిక చేయనున్నారు. కాగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాను యూనిట్‌గా తీసుకోనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలు ఎంతమంది ఉండాలన్నది నిర్ణయించి అధ్యక్షులను ఖరారు చేస్తారన్న చర్చ జరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో బీసీ, ఎస్సీలకు ఎక్కడ అవకాశం ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
News October 25, 2025
NLG: చనిపోయి.. వెలుగులు నింపింది..

బ్రెయిన్ డెడ్ అయిన యువతి అవయవ దానం ద్వారా ఎందరో జీవితాలలో వెలుగులు నింపింది. NLGకు చెందిన చెనగొని గిరిప్రసాద్ కుమార్తె రమ్యశ్రీ (28) రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స నిమిత్తం ఆమెను HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు, భర్త అనుమతితో అవయవదానం చేసి ప్రాణదానం చేశారు. ఈ సందర్భంగా వారిని వైద్యులు ప్రశంసించారు.


