News October 13, 2025
సూర్యాపేట: బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

MBNR (D) సీసీ కుంటలోని ఓ గ్రామానికి చెందిన బాలికను మఠంపల్లి మండలం బోజ తండాకు చెందిన చందర్ నాయక్ ప్రేమ పేరుతో అత్యాచారం చేశాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, బాలికను సఖి కేంద్రానికి తరలించినట్లు సీసీ కుంట సీఐ రామకృష్ణ తెలిపారు.
Similar News
News October 13, 2025
NZB: బీజేపీ పోరాట ఫలితంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు: దినేష్ కులాచారి

బీజేపీ పోరాట ఫలితంగానే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. ఇటీవల జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. స్పందించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.
News October 13, 2025
సకాలంలో స్పందించిన విశాఖ పోలీసులు

కంచరపాలెంకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మహారాణిపేట పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కంచరపాలెంలో నివాసం ఉంటున్న యువతి ఇంట్లో కలహారం కారణంగా ఎవరికి చెప్పకుండా ఆర్కే బీచ్‌కి వచ్చి చనిపోవడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు112కు ఫిర్యాదు చేయడంతో వెంటనే సీఐ దివాకర్ యాదవ్ స్పందించి గాలింపు చేపట్టగా బీచ్ రోడ్లో సాగర్ తీరం వద్ద ఉన్న యువతని కాపాడారు.
News October 13, 2025
LED స్క్రీన్‌లో వేములవాడ రాజన్న దర్శనం

TG: వేములవాడ అభివృద్ధి పనుల నేపథ్యంలో LED స్క్రీన్ ద్వారా రాజరాజేశ్వర స్వామి దర్శనం కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్జిత సేవలను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మేడారం జాతర సందర్భంగా భక్తులు ఇక్కడికీ పెద్ద సంఖ్యలో తరలివస్తారని వెల్లడించారు. తొలుత భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక <<17983463>>ఏర్పాట్లు<<>> చేసిన విషయం తెలిసిందే.