News March 23, 2025

సూర్యాపేట: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి

image

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని కుంటపల్లి గ్రామ శివారులో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి చెందాడు. మృతుడి పేరు యాకుబ్ కాగా అతనిది ఏపీ రాష్ట్రమని స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

Similar News

News March 25, 2025

గద్వాల: పెళ్లి ఇష్టం లేక యువకుడి SUICIDE

image

పెళ్లి ఇష్టం లేక యువకుడు ఆత్మహత్యయత్నం చేయగా.. చికిత్స పొందుతూ నిన్న మృతి చెందిన ఘటన ఎర్రవల్లి మండలంలో జరిగింది. ఎస్ఐ వెంకటేశ్ వివరాలు.. కొండపేటకు చెందిన నరహరికి ఇటీవలే వివాహం నిశ్చయమైంది. తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం ఇష్టంలేక ఆదివారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News March 25, 2025

AP EAPCETకు 1.12లక్షల దరఖాస్తులు

image

ఏపీ ఈఏపీసెట్‌కు ఇప్పటివరకు 1,12,606 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెల 15న ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 24 వరకు కొనసాగనుంది. అపరాధ రుసుముతో మే 16 వరకు అప్లై చేసుకోవచ్చు. మే 19 నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు జరగనున్నాయి. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం EAPCET నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.

News March 25, 2025

IPL: నేడు గుజరాత్‌తో పంజాబ్ ఢీ

image

IPLలో ఇవాళ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 5 మ్యాచుల్లో తలపడ్డాయి. GT 3, PBKS 2 మ్యాచుల్లో గెలిచాయి. గత సీజన్‌లో KKRకు కప్ సాధించి పెట్టిన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌లో PBKSకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. GTకి గిల్ కెప్టెన్‌గా ఉన్నారు. మరి ఈ మ్యాచులో గెలుపెవరిది? కామెంట్ చేయండి.

error: Content is protected !!