News March 22, 2024
సూర్యాపేట: భారీగా నగదు, బంగారం పట్టివేత

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అన్ని చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు తెలిపారు. తనిఖీల్లో భాగంగా రూ.15.65 లక్షలు, 690 లీటర్ల మద్యంతో పాటు 27 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. అలాగే 229 గ్రాముల బంగారం, పట్టుబడిన రెడీ మేడ్ దుస్తులు విలువ రూ.21.45 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. బాధితులు ఆధారాలు అందజేస్తే పరిశీలన చేసి అందచేస్తామని చెప్పారు.
Similar News
News February 22, 2026
నల్గొండలో ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

నల్గొండ జిల్లాలో ఈ నెల 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లావ్యాప్తంగా 48 కేంద్రాలలో మొత్తం 27,905 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని జిల్లా ఇంటర్ అధికారి దస్రు నాయక్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాల వద్ద కనీస వసతులు కల్పించారు.
News February 21, 2026
నల్గొండ: పాఠశాలల్లో కంప్యూటర్ల రిపేర్లకు కోటేషన్ల ఆహ్వానం!

జిల్లాలోని 200 ప్రభుత్వ పాఠశాలల్లో నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఐఎఫ్‌పీ స్క్రీన్ల మరమ్మతుల కోసం సమగ్ర శిక్షా విభాగం కోటేషన్లను ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల సంస్థలు ఈ నెల 23 నుంచి మార్చి 2వరకు జిల్లా విద్యాశాఖాధికారి (DEO) కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. మార్చి 3న కలెక్టరేట్‌లో ఈ కోటేషన్లను తెరుస్తారని ఆయన పేర్కొన్నారు.
News February 21, 2026
నల్గొండలో 24న మినీ జాబ్ మేళా

నల్గొండలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి ఎన్. పద్మ తెలిపారు. ఐటీఐ క్యాంపస్‌లోని ఉపాధి కార్యాలయంలో ఉదయం 10:30 గంటలకు ఈ మేళా ప్రారంభమవుతుందని తెలిపారు. ఇతర వివరాలకు 7893420435 నంబర్‌ను సంప్రదించాలని ఆమె కోరారు.


