News February 8, 2025
సూర్యాపేట: మహిళ హత్య.. నిందితుడికి జీవిత ఖైదు
మహిళ హత్య కేసులో ఓ వ్యక్తికి NLG జిల్లా 2వ అదనపు కోర్టు జడ్జి రోజారమణి గురువారం జీవిత ఖైదు విధించారు. చివ్వెల(M)కి చెందిన విజయకు కర్నూలు జిల్లాకు చెందిన మూజువర్ నూర్ మహ్మద్‌తో పరిచయమైంది. వారు కొంతకాలం సహజీవనం చేయగా ఆమెకు వేరొకరితో సంబంధం ఉందని అనుమానించిన మహ్మద్ 2014జూన్6న కనగల్(M) పర్వతగిరి వద్ద ఆమెను హత్య చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా జడ్జి పైవిధంగా తీర్పునిచ్చారు.
Similar News
News February 8, 2025
మెదక్ జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది
గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సిద్ధం అవుతోంది. మెదక్ జిల్లాలో 493 గ్రామపంచాయతీలుండగా, మొత్తం 5,25,478మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,52,797మంది, మహిళలు 2,72,672మంది ఉన్నారు. ఇతరులు 9మంది ఉన్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాను అనుసరించి తాజాగా గ్రామపంచాయతీ ఓటర్ జాబితాను అధికారులు సిద్ధం చేశారు.
News February 8, 2025
మనీశ్ సిసోడియా ఓటమి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఓడిపోయారు. జంగ్‌పుర నుంచి పోటీ చేసిన ఆయనపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు.
News February 8, 2025
VKB: ‘స్థానిక’ ఎన్నికలు.. కాంగ్రెస్, BRS, BJP మంతనాలు
ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో వికారాబాద్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPకి చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.