News March 26, 2024
సూర్యాపేట మీదుగా రైలు మార్గం
డోర్నకల్ నుంచి గద్వాల్ వరకు కొత్త రైల్వే మార్గానికి సూర్యాపేట జిల్లా మోతే మండలంలో సర్వే జరుగుతోంది. మండలంలోని కొత్తగూడెం, తుమ్మలపల్లిలో సర్వే బృందం మార్కింగ్ చేస్తున్నారు. సుమారు 296 కిలోమీటర్ల ఈ రైలు మార్గం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోతే, చివ్వెంల, సూర్యాపేట, కేతేపల్లి, తిప్పర్తి, నల్గొండ, కనగల్, చండూరు, నాంపల్లి, చింతపల్లి మండలాల్లోని గ్రామాల నుంచి వెళ్లనుంది.
Similar News
News January 9, 2025
డిండి: ఆకతాయిలతో కోర్టు ఆవరణం శుభ్రం చేయించారు
కందుకూరులో ఇటీవల మద్యం సేవించి ఓ వ్యక్తిపై అకారణంగా దాడికి ప్రయత్నించి అలజడి సృష్టించిన కోక అభిషేక్, జోసెఫ్, శివాజీపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఎదుట బుధవారం ప్రవేశపెట్టారు. ముగ్గురు ఆకతాయిలు ఒక్కరోజు శిక్షలో భాగంగా కమ్యూనిటీ సర్వీస్ కింద కోర్టు ఆవరణం శుభ్రం చేయాల్సిందిగా స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ పొట్ట చెన్నయ్య ఆదేశించారని ఎస్సై రాజు అన్నారు. వారితో శిక్షను అమలు చేశామన్నారు.
News January 9, 2025
జిల్లాలో దొంగతనాల నివారణకు ప్రత్యేక బృందాలు: ఎస్పీ
నల్గొండ జిల్లాలో దొంగతనాల నివారణకు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అనుమానిత వ్యక్తులు కాలనీల్లో తిరిగినట్లు కనిపిస్తే సమీపంలోని స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. అలాగే కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
News January 8, 2025
NLG: గురుకులాల్లో అడ్మిషన్లు.. మిస్ చేసుకోకండి
రాష్ట్రంలోని SC, ST, BC, జనరల్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-26కి 5వ తరగతి తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 1లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు https://tgcet.cgg.gov.in లో చూడొచ్చు.