News December 15, 2025
సూర్యాపేట: ముగిసిన ప్రచారం.. ఎల్లుండి భవిత్యం

సూర్యాపేట జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఏడు మండలాల్లో జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. మొత్తం 146 గ్రామ పంచాయతీలకు గాను 22 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఈనెల 17న 124 పంచాయతీల్లో జరిగే పోలింగ్‌లో ఇదే సమయానికి బరిలో ఉన్న అభ్యర్థుల భవిత్యం తేలనుంది.
Similar News
News December 17, 2025
వచ్చే సంక్రాంతికి 21 లక్షల పాస్ పుస్తకాలు: మంత్రి

AP: రీ సర్వే చేసిన గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. భూముల రీ క్లాసిఫికేషన్‌పై దాదాపు లక్ష ఫిర్యాదులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రైవేట్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం కలెక్టర్లకు ఇస్తామన్నారు.
News December 17, 2025
దుబ్బా తండా సర్పంచ్‌గా రామ్ నాయక్

దేవరుప్పుల మండలంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దుబ్బతండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి లకావత్ రామ్ నాయక్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 106 ఓట్ల తేడాతో గెలుపొందారు.
News December 17, 2025
కాలీఫ్లవర్‌లో బట్టనింగ్ లక్షణాలు – నివారణ

కాలీఫ్లవర్‌లో సాధారణ పరిమాణంలో కాకుండా చిన్న చిన్న పూలు ఏర్పడటాన్ని బట్టనింగ్ అంటారు. ముదురు నారు నాటుకోవడం, నేలలో నత్రజని తక్కువగా అవటం, స్వల్పకాలిక రకాలను ఆలస్యంగా నాటడం వల్ల బట్టనింగ్ సమస్య వస్తుంది. దీని నివారణకు 21 నుంచి 25 రోజుల వయసు గల నారును మాత్రమే నాటుకోవాలి. తగినంత మోతాదులో నత్రజని ఎరువు వాడాలి. అలాగే స్వల్పకాలిక రకాలను ఆలస్యం చేయకుండా సరైన సమయంలో నాటుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


