News November 1, 2025
సూర్యాపేట: మోజు తీరిన తర్వాత ముఖం చాటేశాడు!

మహిళను ఓ యువకుడు మోసం చేయగా కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూర్యాపేటకు చెందిన డిగ్రీ విద్యార్థి రమేశ్(20)కు 2022లో బంజారాహిల్స్ ఇందిరానగర్‌లో నివసించే ఓ మహిళ(32) ఇన్‌స్టాలో పరిచయమైంది. ఆమెకు ఒక కూతురు ఉండగా భర్త చనిపోయాడు. ఈవిషయాన్ని ఆమె రమేశ్‌కు చెప్పింది. దీంతో తాను పెళ్లి చేసుకుని, తల్లీబిడ్డను బాగా చూసుకుంటానని నమ్మించాడు. మోజు తీరిన తర్వాత ముఖం చాటేయగా ఆమె PSలో ఫిర్యాదు చేసింది.
Similar News
News November 1, 2025
మద్యం ఫీజుల రాకతో బకాయి నిధులు విడుదల

TG: లిక్కర్ షాపుల లైసెన్సు ఫీజుల కింద ₹2,854 కోట్లు రావడంతో ప్రభుత్వం పలు విభాగాల్లో ఉన్న బకాయిలను విడుదల చేస్తోంది. విద్యార్థులకు ₹304 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ₹252 కోట్లు రిలీజ్ చేసింది. ఇవి కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల తరుణంలో మున్సిపాల్టీలు, పంచాయతీల రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రతి విభాగంలో కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లించేందుకు ₹1కోటి చొప్పున ఇవ్వనుంది.
News November 1, 2025
కరీంనగర్: ఉ.11 వరకు 16 శాతం పోలింగ్

కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్దఎత్తున ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కరీంనగర్, జగిత్యాలలో అధికారులు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల వరకు 16 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం కౌంటింగ్ ప్రారంభం కానుంది.
News November 1, 2025
మొంథా తుఫాను సేవలు: శ్రీశైలం ఎమ్మెల్యేకు సీఎం అవార్డు

శ్రీశైలం నియోజకవర్గంలో ఇటీవల సంభవించిన ‘మొంథా’ తుఫాను విపత్తులో ఉత్తమ సేవలు అందించినందుకు గానూ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ మేరకు శనివారం ఉండవల్లిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే బుడ్డాకు ముఖ్యమంత్రి అవార్డును బహూకరించారు. వరద విపత్తులో తన కృషిని గుర్తించడంపై ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.


