News December 22, 2025

సూర్యాపేట, యాదాద్రిలోనూ డీసీసీబీ..!

image

జిల్లాలోని సహకార వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిధిలో జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు కొనసాగుతున్నది. అయితే జిల్లాకో డీసీసీబీ ఏర్పాటుకు సన్నాహాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో మాత్రమే డీసీసీబీ బ్యాంకు ఉన్నది. యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలోనూ డీసీసీబీలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది.

Similar News

News December 22, 2025

VKB: ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం

image

ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వర పరిష్కారం చూపి ఫిర్యాదుదారులకు న్యాయం చేస్తున్నామని కలెక్టర్ ప్రతీక్‌జైన్ తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.

News December 22, 2025

వరంగల్: మాజీ ACP, CI, SI సస్పెండ్

image

గతంలో వరంగల్ ఏసీపీగా విధులు నిర్వహించిన నందిరాం నాయక్‌తో పాటు ప్రస్తుతం సీసీఎస్ CI గోపి, ఎస్ఐ విఠల్‌ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేసే సమయంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో తప్పుడు కేసు నమోదు చేసినట్లుగా ఫిర్యాదులందడంతో, దీనిపై విచారణ జరిపి అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశారు.

News December 22, 2025

జగిత్యాల: డూప్లికేట్, బ్లర్ ఎంట్రీల సవరణపై దృష్టి

image

ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తహశీల్దార్లను ఆదేశించారు. డూప్లికేట్ ఎంట్రీలు, సమాన వివరాలు, బ్లర్ ఫోటోలు సరిదిద్దాలని సూచించారు. ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం పరిశీలించి క్షేత్రస్థాయిలో నమోదు చేయాలని, బూత్ స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఓటరు జాబితా రూపొందించాలని తెలిపారు.