News February 17, 2025
సూర్యాపేట: రంజాన్ నెలలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు

రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు ఒక గంట ముందు తమ కార్యాలయం నుంచి వెళ్లాడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి రెండో తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ ఉత్తర్వుల ప్రకారం ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు విధుల నుంచి గంట ముందు వెళ్లే అనుమతి ఉంటుంది. ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం ఉద్యోగుల వెసులుబాటు కోసం ఈ ఉత్తర్వులు అమలు చేస్తున్నారు.
Similar News
News November 7, 2025
ఫర్నిచర్ శిక్షణకు మరో అవకాశం: భద్రాద్రి కలెక్టర్

హైదరాబాద్‌తో పాటు రాజమండ్రిలో కూడా ఫర్నిచర్ శిక్షణకు అవకాశం లభించిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. హైదరాబాద్ శిక్షణకు ఇప్పటికే 19 మంది ఎంపిక కాగా, అదనంగా రాజమండ్రిలో శిక్షణ కోసం మరో 11 సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్‌లోని ఎస్20 (S20)లో జరిగే ఓరియంటేషన్, ఎంపిక పరీక్షకు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.
News November 7, 2025
విటమిన్స్ లోపం-లక్షణాలు

విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయట పడుతూ ఉంటుంది. నోటి చివర్లలో పగుళ్లు ఏర్పడుతుంటే జింక్, ఐరన్, బి విటమిన్లు (నయాసిన్, రైబోఫ్లోవిన్, విటమిన్ బి12) లోపం. చర్మంపై రాషెస్, జుట్టు రాలడం ఉంటే బయోటిన్ (విటమిన్ బి7) లోపం. చేతులు, పాదాల్లో చురుక్కుమనడం, తిమ్మిర్లుంటే బి విటమిన్ల (ఫోలేట్, బి6, బి12)లోపమని అర్థం చేసుకోవాలి. కాళ్లలో పోట్లు ఉంటే మెగ్నీషియం, క్యాల్షియం, పొటాషియం లోపమని గుర్తించాలి.
News November 7, 2025
నిర్మల్: కార్డులు సరే.. పథకాలు ఏవి?

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా మారింది కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారి పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక జిల్లాలో 29,386 కొత్త రేషన్ కార్డులు జారీ అయ్యాయి. అయితే రేషన్ కార్డుదారులు బియ్యం పంపిణీ మినహా ఇతర ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారు. ప్రజాపాలన వెబ్ సైట్‌లో కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి ఆప్షన్ లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.


