News November 13, 2025
సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ నరసింహ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న పలు రికార్డులను, పరిసరాలు, ఫిర్యాదుల నిర్వహణ, రిసెప్షన్ మేనేజ్‌మెంట్ మొదలగు అంశాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన బాధితులతో మాట్లాడి ఫిర్యాదులను త్వరితగతిన పరిశీలించాలని ఎస్సైని ఆదేశించారు. జాతీయ రహదారి వెంట పటిష్టమైన నిఘా ఉంచి భద్రత పర్యవేక్షించాలన్నారు.
Similar News
News November 13, 2025
అలంపూర్: వే2 న్యూస్ ఎఫెక్ట్.. స్పందించిన అధికారులు

అలంపూర్ సమీపంలోని గొందిమల్ల కృష్ణా నది వద్ద ప్రభుత్వ నిషేధిత అలవి వలలతో గుట్టుగా చేపలు పడుతున్న ఇద్దరు వ్యక్తులపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. చేపల మాఫియా పంజా.. మత్స్యకారుల ఆవేదన అనే శీర్షికన <<18273550>>Way2Newsలో<<>> కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా మత్స్యశాఖ అధికారిణి షకీలా భాను, MRO మంజుల, ఎస్ఐ వెంకటస్వామి అక్కడికి చేరుకుని వలలను గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 13, 2025
నక్కపల్లిలో వెయ్యి ఎకరాల్లో టాయ్ పార్క్

నక్కపల్లి మండలంలోని కారిడార్ భూముల్లో మహిళలకు ఉపాధినిచ్చే టాయ్ పార్కు ఏర్పాటు కానుంది. చైనా తరహాలో ఎకో సిస్టంతో బొమ్మలను తయారు చేసే యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ఒక విదేశీ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం సుమారు వెయ్యి ఎకరాల భూమి అవసరమని గుర్తించారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, కలెక్టర్ విజయ్ కృష్ణన్‌తో హోంమంత్రి అనిత చర్చించారు.
News November 13, 2025
జనగామ: దందా ఎంపీవోలు.. భగ్గుమంటున్న కార్యదర్శులు..!

జనగామ జిల్లాలోని పలువురు మండల పంచాయతీ అధికారులు(ఎంపీవో) దందాలకు పాల్పడుతున్నారు. పంచాయతీ కార్యదర్శుల నుంచి వసూళ్లకు పాల్పడుతూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రోహిబిషన్ ఫైల్స్, చేసిన పనులకు చెక్కులు జారీ చేసేందుకు చేతులు చాస్తున్నారు. గ్రామాల సందర్శనకు వచ్చినందుకు సైతం వారి వ్యక్తిగత కార్లలో పెట్రోల్‌కు సైతం పైసలు వసూల్ చేస్తున్న ఎంపీవోలపై కార్యదర్శులు భగ్గుమంటున్నారు.


