News January 2, 2025
సూర్యాపేట: రూ.1,500 కోసం కొట్టుకున్న పోలీసులు
రూ.1,500 కోసం కానిస్టేబుల్, హోంగార్డు ఘర్షణ పడిన ఘటన పెన్‌పహాడ్‌లో జరిగింది. SI గోపికృష్ణ తెలిపిన వివరాలు.. పెన్‌పహాడ్‌లో ఓ టీ స్టాల్ దుకాణదారుడు కానిస్టేబుల్ రవికుమార్‌కు, హోంగార్డు శ్రీనుకు రూ.1500 క్రిస్మస్ ఇనాం ఇచ్చాడు. వీటిని పంచుకునే విషయంలో DEC 28న ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ విషయం SP సన్‌ప్రీత్ సింగ్ దృష్టికి వెళ్లగా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. హోంగార్డును SPఆఫీస్‌కు అటాచ్ చేశారు.
Similar News
News January 5, 2025
మానవ వ్యాధుల నివారణలో ఔషధ మొక్కల పాత్ర కీలకం
మానవ వ్యాధుల నివారణలో ఔషధ మొక్కల పాత్ర కీలకమని కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య ముస్తఫా అన్నారు. శనివారం మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఔషధ మొక్కలపై నిర్వహించిన అతిథి ఉపన్యాస కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వృక్షాల వర్గీకరణ, ఔషధ మొక్కలు, వృక్షజాతుల గుర్తింపు , ముఖ్యంగా వ్యాధుల నివారణలో మొక్కల యొక్క పాత్రను విద్యార్థులకు వివరించారు.
News January 4, 2025
NLG: సమ్మెలో హమాలీలు.. సంక్రాంతికి పస్తులేనా?
ఉమ్మడి NLG జిల్లాలో పండుగపూట కార్డుదారుల ప’రేషన్’ మొదలైంది. ఈ నెల 1నుంచి హమాలీలు సమ్మెలో ఉండగా ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయాయి. రేషన్ షాపుల్లో ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వరకు బియ్యం పంపిణీ చేసేవారు. హమాలీలు సమ్మె చేస్తుండడంతో బియ్యం ఇంకా రేషన్ దుకాణాలకు చేరలేదు. సంక్రాంతి పండుగకు పిండి వంటలు చేసేందుకు బియ్యమే కీలకం కాగా ఇంకా రేషన్ దుకాణాల్లో పంపిణీ లేకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News January 4, 2025
BREAKING: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
నల్గొండ జిల్లా తిప్పర్తి మండల శివారులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టడంతో బైక్ చెట్టుని ఢీకొంది. ప్రమాదంలో కారులో ఉన్న మహిళ ఎగిరి పొలంలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. గాయాలైన మరో ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.