News December 16, 2025
సూర్యాపేట: రెప్పపాటులో 50 మంది చిన్నారులకు తప్పిన ముప్పు!

సూర్యాపేటలో ఈరోజు స్కూల్ బస్సు అదుపుతప్పి ఒక వ్యక్తిని, <<18584704>>చెట్టును ఢీకొట్టిన విషయం<<>> తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. స్కూల్ అవగానే సుమారు 50 మంది ప్రైమరీ స్కూల్ విద్యార్థులతో కలిసి వస్తుండగా ఒక్కసారిగా బస్సు అదుపుతప్పింది. రెప్పపాటులో పిల్లలకు ముప్పు తప్పి, సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Similar News
News December 17, 2025
ఉండి: ఫలించిన ప్రియురాలు ధర్నా.. కథ సుఖాంతం

ఉండి మండలం మహాదేవపట్నం శివారు రామచంద్రపురానికి చెందిన భానుప్రకాష్ ఇంటి ముందు సోమవారం సాయంత్రం ప్రియురాలు దుర్గాభవాని కుటుంబ సమేతంగా సోమవారం ధర్నాకు దిగిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి వ్యవహారం ఉండి పోలీస్ స్టేషన్‌కు చేరటంతో ఎట్టకేలకు ప్రియుడు దిగివచ్చాడు. పెళ్లి చేసికోవడానికి అంగీకరించాడు. పెద్దల సమక్షంలో పత్రాలు రాయడంతో కథ సుఖాంతమైంది.
News December 17, 2025
ధోనీకి ఇదే చివరి IPL: ఊతప్ప

రానున్న IPL సీజనే ధోనీకి చివరిదని CSK మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప అన్నారు. ఆపై ఎడిషన్‌లో ఆడతారని తాను అనుకోవట్లేదని చెప్పారు. ప్రస్తుతం జట్టు కూర్పు చూస్తే అదే అర్థమవుతోందన్నారు. ‘గతేడాది, తాజాగా జరిగిన మినీ వేలంలోనూ యంగ్ క్రికెటర్లపై CSK ఎక్కువగా ఖర్చు చేసింది. అలాగే రుతురాజ్, శాంసన్ వంటి సారథులు జట్టులో ఉన్నారు. ఈ క్రమంలో ధోనీ టీం నుంచి తప్పుకొని మెంటార్‌గా కొనసాగే అవకాశాలున్నాయి’ అని చెప్పారు.
News December 17, 2025
IPL వేలం.. రాజస్థాన్ టీమ్‌లో కరీంనగర్ కుర్రాడు

ఐపీఎల్ వేలంలో కరీంనగర్ అబ్బాయి అమన్ రావును రాజస్థాన్ రాయల్స్ టీం రూ.30 లక్షలకు దక్కించుకుంది. రూ.30 లక్షల బేస్ ప్రైజ్‌తో ఆక్షన్‌లోకి వచ్చిన అతణ్ని అంతే ధరకు సొంత చేసుకుంది. ఇప్పటికే HCA అండర్-19, అండర్-23 విభాగాలలో అద్భుత ప్రదర్శన చేశారు. అండర్-23 SMATలో 160+ స్ట్రైక్ రేట్‌తో రాణించాడు. అయితే IPLలో రాణించి కరీంనగర్‌కు పేరు తీసుకురావాలని జిల్లా వాసులు కోరుతున్నారు.


