News April 5, 2025

సూర్యాపేట: రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

image

సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎస్ఐ వివరాలు.. గరిడేపల్లి మండలం కల్మల్‌చుర్వు గ్రామానికి చెందిన సైదులు(53) హనుమంతులగూడెంకి వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ఘనటలో సైదులు స్పాట్‌లోనే మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News April 5, 2025

NTR లుక్‌పై అభిమానుల ఆందోళన!

image

యంగ్ టైగర్ NTR కొత్త లుక్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘NTR-NEEL’ సినిమా కోసం ఆయన ఒక్కసారిగా బరువు తగ్గారు. ఎన్టీఆర్ అంటే కాస్త చబ్బీగా కండలు తిరిగిన బాడీతో ఉండాలని, ఇంత స్లిమ్‌ అవ్వడం ఏంటని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ లుక్ ఆయనకు సూట్ కాలేదని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కొందరేమో స్లిమ్‌గా అదిరిపోయారు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ లుక్ మీకెలా అనిపించింది? COMMENT

News April 5, 2025

కేసీఆర్‌తో సమావేశమైన నల్గొండ బీఆర్ఎస్ నేతలు

image

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ, రజతోత్సవ వేడుకలు విజయవంతం చేయడానికి జిల్లాలో చేస్తున్న కార్యక్రమాలను కేసీఆర్‌కు వివరించారు. ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

News April 5, 2025

CSKvsDC: చెన్నై టార్గెట్ ఎంతంటే?

image

చెపాక్ వేదికగా CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 183/6 స్కోర్ చేసింది. మెక్‌గుర్క్ డకౌట్ కాగా కేఎల్ రాహుల్ 77, అభిషేక్ పోరెల్ 33, అక్షర్ పటేల్ 21, సమీర్ రిజ్వీ 20, స్టబ్స్ 24* రన్స్ చేశారు. ఖలీల్ అహ్మద్ 2, రవీంద్ర జడేజా, నూర్ అహ్మద్, పతిరణ తలో వికెట్ తీశారు. విజయం కోసం చెన్నై 184 పరుగులు చేయాలి.

error: Content is protected !!