News January 23, 2025

సూర్యాపేట: లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూ.100 కోట్లు

image

సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పాలకవీడు మండలం జవహర్ జాన్ పహాడ్ లిఫ్ట్ ఇరిగేషన్‌ను ఆర్11 వరకు పొడిగించాలని, దానికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. బెట్టె తండా చెక్ డ్యాంకు 7.5 కోట్లు, జాన్ పహాడ్ నుంచి కృష్ణానది పంప్ హౌస్ వరకు రూ.కోటితో మెటల్ రోడ్డు మంజూరు చేసినట్లు చెప్పారు. 

Similar News

News September 14, 2025

బాపట్ల ఎస్పీగా ఉమామహేశ్వర్ బాధ్యతలు

image

బాపట్ల జిల్లా ఎస్పీగా ఉమామహేశ్వర్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు పోలీసులు ముందుగా గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయంలో వేద పండితుల మధ్య బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో క్రైమ్ రేటు తగ్గించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నూతన ఎస్పీకి పలువురు శుభాకాంక్షలు చెప్పారు.

News September 14, 2025

SLBC కూలి 200 రోజులైనా స్పందించని కేంద్రం: కేటీఆర్

image

TG: SLBC టన్నెల్ కూలి 200 రోజులైనా కేంద్రం స్పందించడం లేదని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికీ బాధితులకు ఎలాంటి పరిహారం అందించలేదని ఎక్స్‌లో ఆరోపించారు. ‘కాళేశ్వరంలో చిన్నపాటి లోపాలకే హంగామా చేసిన కేంద్ర ప్రభుత్వం SLBC ఘటనపై ఒక్క బృందాన్ని కూడా పంపలేదు. చోటా భాయ్‌ను బడే భాయ్ కాపాడుతున్నారు. మేము ఈసారి అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.

News September 14, 2025

జూరాల ప్రాజెక్టుకు 9 గేట్లు ఎత్తివేత

image

ధరూరు మండలంలోని జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక నుంచి వరద కొనసాగుతుంది. ఆదివారం ఉదయం ప్రాజెక్టుకు 1 లక్ష క్యూసెక్కులు వస్తుంది. దీంతో ప్రాజెక్టు అధికారులు 9 స్పిల్ వే గేట్లు ఓపెన్ చేసి 62,406 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి 38,271, ఎడమ కాలువకు 550 క్యూసెక్కులు మొత్తం 1,01,272 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది.