News October 30, 2025
సూర్యాపేట: విద్యాసంస్థల బంద్ విజయవంతం

భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్త కళాశాలల బంద్ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలో బంద్ విజయవంతమైంది. స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ అన్నారు. వెంటనే ఫీజు బకాయిలను విడుదల చేయాలని కోరారు.
Similar News
News October 30, 2025
మెనుస్ట్రువల్ లీవ్‌కు ఫొటో అడగడంపై ఆందోళనలు

మహిళలు బయటకు చెప్పలేని అంశాల్లో రుతుస్రావం ఒకటి. విధులకూ వెళ్లలేని స్థితి. ఈ కారణంతో సెలవు అడిగిన సిబ్బందిని మెనుస్ట్రువల్ ఫొటోలు పంపాలని MD వర్సిటీ(హరియాణా) అధికారులు అడగడం వివాదంగా మారింది. గవర్నర్ వర్సిటీని సందర్శించినప్పుడు ఇది చోటుచేసుకుంది. చివరకు తాము వాడిన ప్యాడ్స్ ఫొటోలు పంపినా సెలవు ఇవ్వలేదని సిబ్బంది వాపోయారు. దీనిపై ఆందోళనలతో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ గుప్తా తెలిపారు.
News October 30, 2025
అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్షించాలి: కలెక్టర్, ఎస్పీ

అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ తుఫాను ప్రభావ పరిస్థితులను సమీక్షించాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. ఈమేరకు కలెక్టరేట్లో తుఫాన్ ప్రభావంపై తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రతి 2 గంటలకు ఒకసారి నివేదికలు పంపించాలని, కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడవకుండా చూడాలన్నారు.
News October 30, 2025
సోమశిలకు పెరుగుతున్న వరద

సోమశిల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 4 నుంచి 8 క్రస్ట్ గేట్లు ఎత్తి 77,650 క్యూసెక్కుల నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయానికి 78,460 క్యూసెక్కుల వరద వస్తోంది. అంతే మొత్తంలో కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 72 టీఎంసీలకు చేరింది. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. వరద పెరుగుతుండటంతో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు.


