News January 26, 2025
సూర్యాపేట: సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ దిశా నిర్దేశం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నుంచి శ్రీకారం చుడతామని కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ తెలిపారు.శనివారం సూర్యాపేట కలెక్టర్ సమావేశ మందిరం వేబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు ఉన్నారు.
Similar News
News December 17, 2025
దోమలో లాటరీ సర్పంచ్

దోమ మండలం పాలేపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులకు 469 సమాన సంఖ్యలో ఓట్లు రావడంతో ఫలితం తేలలేదు. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారులు లాటరీ పద్ధతిని అమలు చేశారు. అధికారుల సమక్షంలో నిర్వహించిన లాటరీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేసిన బచ్చి గారి సుజాత విజయం సాధించారు.
News December 17, 2025
డిజిటల్ అరెస్ట్ అంటూ ఫోన్ చేస్తే భయపడకండి: సైబర్ క్రైమ్ డీసీపీ

ఎన్‌టిఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘సైబర్ సురక్షా’ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణ ప్రసన్న విద్యుత్ ఉద్యోగులకు అవగాహన కల్పించారు. డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియ లేదని, వీడియో కాల్స్ ద్వారా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తే నమ్మవద్దని తెలిపారు. ఆన్లైన్ మోసాల బారిన పడితే వెంటనే 1930కు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News December 17, 2025
రిజల్ట్స్: కూతురిపై తండ్రి.. తల్లిపై కూతురు విజయం

TG: మూడో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఆసక్తికర విజయాలు చోటుచేసుకున్నాయి. ఖమ్మం(D)లోని పెనుబల్లిలో తల్లి తేజావత్‌పై కూతురు బానోతు పాపా గెలుపొందారు. నారాయణపేటలోని కోల్పూరులో కూతురిపై తండ్రి రాములు 420 ఓట్ల తేడాతో గెలుపొందారు. సొంతింటి వారే ప్రత్యర్థులుగా మారిన ఈ పోరు చర్చనీయాంశంగా మారింది. అటు ఆదిలాబాద్(D) బరంపూర్‌లో 69 ఏళ్ల(ఏకగ్రీవం) తర్వాత జరిగిన ఎన్నికల్లో BRS అభ్యర్థి దేవరావు గెలిచారు.


