News November 11, 2025

సూర్యాపేట: ‘సార్’ ఐడియా.. హాజరు శాతం పెరిగింది

image

గరిడేపల్లి మండలం రంగాపురం పాఠశాలలో విద్యార్థులను బడికి రప్పించేందుకు ఉపాధ్యాయుడు చారగండ్ల రాజశేఖర్ వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు. సరిగా బడికి రాని పిల్లలకు ‘రోజుకో రూపాయి’ ఇస్తానని ప్రకటించారు. చిన్న చిన్న బహుమతులే పిల్లల జీవితాల్లో మార్పులు తెస్తాయని ఆయన తెలిపారు. ఈ ప్రయత్నంతో ఆరుగురు మాత్రమే ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 20 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 11, 2025

కల్తీ నెయ్యి కేసులో విచారణకు ధర్మారెడ్డి

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో మాజీ టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. అలిపిరి సమీపంలోని సీబీఐ సిట్ కార్యాలయానికి చేరుకున్న ఆయన భద్రతా వలయంలో లోపలికి చేరుకున్నారు. సిట్ డీఐజీ మురళీ రాంభా ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. రెండు రోజులు పాటు విచారణ జరగనుంది.

News November 11, 2025

కృష్ణా నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

image

తాడేపల్లి పరిధి సీతానగరంలోని కృష్ణానదిలో మంగళవారం ఉదయం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు. మృతుని వయస్సు సుమారు 30నుండి 34 ఏళ్ల మద్యలో ఉంటుందని మృతుడు నలుపు రంగు ఫ్యాంటు, నీలం రంగు చొక్కా ధరించినట్లు చెప్పారు. మృతుని వివరాలు తెలిస్తే 86888 31364 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

News November 11, 2025

డ్రగ్స్ నివారణకు భాగస్వాములు కావాలి: ఎస్పీ రోహిత్ రాజు

image

డ్రగ్స్ బారినపడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. మంగళవారం సుజాతనగర్ నుంచి వేపలగడ్డ వరకు ‘డ్రగ్స్ పై యుద్ధం’ పేరుతో బైక్ ర్యాలీ నిర్వహించారు. గంజాయి రవాణాను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. మత్తు పదార్థాల రవాణా గురించి తెలిస్తే పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రెహమాన్, సీఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.