News February 26, 2025
సూర్యాపేట: సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ

NLG, KMM, WGL శాసన మండలి ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సూర్యాపేట జిల్లా సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ నిమిత్తం ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ బుధవారం సందర్శించారు. సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఎన్నికల సామాగ్రి పంపిణీ తీరుతెన్నులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Similar News
News February 20, 2026
పాత ఫోన్లలో అరుదైన ఖనిజాలు!

పాత ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో అరుదైన ఖనిజాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధ విమానాలు, క్షిపణులు, EVల్లో వాడే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఉన్నాయని అంటున్నారు. ఇవి నియోడైమియం, సమారియం వంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌తో తయారైన శక్తిమంతమైన మ్యాగ్నెట్స్ అని పేర్కొంటున్నారు. వీటిని రిసైకిల్ చేస్తే ఇండియాకు తిరుగుండదని, రేర్ ఎర్త్ మినరల్స్ కోసం విదేశాలపై ఆధారపడాల్సిన పని ఉండదని వెల్లడిస్తున్నారు.
News February 20, 2026
16 శుక్రవారాల వ్రతం ఉద్యాపన విధానం

16 శుక్రవారాల వ్రతం పూర్తయ్యే చివరి వారంలో ‘ఉద్యాపన’ చేయాలి. ఆ రోజున 8 మంది బాలురను ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి. భోజనంలో పాయసం, పూరీ, బెల్లం, శనగలు వడ్డించాలి. భోజనంలో పులుపు ఉండకూడదు. భోజనం తర్వాత పిల్లలకు అరటిపండు, ప్రసాదం, దక్షిణ ఇవ్వాలి. పిల్లలు ఆ రోజున ఏ విధమైన పులుపు పదార్థాలు తినకుండా జాగ్రత్త వహించాలి. అప్పుడే వ్రతం సంపూర్ణమవుతుంది. అమ్మవారి కృపతో ఆ ఇల్లు సుఖశాంతులతో నిండిపోతుంది.
News February 20, 2026
బంగారు మనసు.. 100గ్రా. గోల్డ్ తిరిగిచ్చేశాడు!

₹15 లక్షల విలువైన బంగారాన్ని తిరిగిచ్చి స్క్రాప్ డీలర్ నిజాయతీ చాటుకున్నారు. హరియాణాలోని ఫరీదాబాద్‌లో అశోక్ శర్మ 2025లో కుంభమేళాకు వెళ్తూ 100G బంగారం పేపర్లో దాచి మరిచిపోయారు. దీపావళికి ఇల్లు క్లీన్ చేసి, పొరపాటున స్క్రాప్‌తో కలిపి అమ్మేశారు. తర్వాత స్క్రాప్ షాపులో వెతికినా బంగారం దొరకలేదు. ఈ క్రమంలో 4 నెలల తర్వాత షాప్ యజమాని అఖ్తర్ ఖాన్‌కు బంగారం కనిపించింది. పోలీసుల ద్వారా అశోక్‌కు అందజేశారు.


