News January 29, 2026

సూర్యాపేట: హస్తం పార్టీలో టికెట్ల లొల్లి

image

SRPT మున్సిపాలిటీలో కౌన్సిలర్‌ టికెట్ల కోసం ఆశావహులు పోటెత్తారు. 48 వార్డులకు 600 దరఖాస్తులు రావడంతో కాంగ్రెస్‌లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. వార్డుకు ఇద్దరు చొప్పున అభ్యర్థులు ఉంటారని భావించినా, భారీగా అప్లికేషన్లు రావడంతో హైకమాండ్ విస్మయం వ్యక్తం చేసింది. దీంతో రంగంలోకి దిగిన మంత్రి ఉత్తమ్, సమన్వయ కమిటీని నియమించారు. ఈ కమిటీ అభ్యర్థుల వడపోత పూర్తి చేసిన తర్వాతే బీ-ఫామ్ అందజేయనున్నారు.

Similar News

News February 14, 2026

మిర్యాలగూడలో ఇదే హయ్యెస్ట్ మెజార్టీ

image

మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 29వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి షేక్ జావిద్ తన సమీప సీపీఎం అభ్యర్థిపై 1,076 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి, మున్సిపాలిటీలోనే అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా నిలిచారు. మరోవైపు, 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బూడిద సైదులు కేవలం ఒక్క ఓటు తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించి, అత్యల్ప మెజారిటీతో గెలుపొందడం విశేషం.

News February 13, 2026

నల్గొండ: ‘ప్రజావాణి’ ప్రారంభం

image

నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియడంతో నిలిచిపోయిన ‘ప్రజావాణి’ కార్యక్రమం తిరిగి ప్రారంభం కానుంది. ఈ సోమవారం నుంచి కలెక్టరేట్‌లో ప్రజల నుంచి అర్జీలను యథావిధిగా స్వీకరిస్తామని కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున గత కొన్ని వారాలుగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.

News February 13, 2026

ఎంజీయూ B.Ed ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్ విడుదల

image

ఎంజీయూ పరిధిలోని B.Ed సెమిస్టర్-3 రెగ్యులర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షల కోసం ఎగ్జామినర్ల జాబితాను యూనివర్సిటీ ప్రకటించింది. ఈ నెల 17, 18 తేదీల్లో గ్రూప్-A కాలేజీలకు, 19, 20 తేదీల్లో గ్రూప్-B కాలేజీలకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. ఉపేందర్ రెడ్డి తెలిపారు.