News April 28, 2024
సూర్యాపేట: ‘100 మంది మృతి.. 200 మంది దివ్యాంగులుగా మారారు’

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సూర్యాపేట జిల్లాలో సుమారు 200లకు పైగా ప్రమాదాలు జరగగా, వాటిలో 100 మందికి పైగా మరణించడం గమనార్హం. మరో 200 మంది ప్రమాదంలో గాయపడి దివ్యాంగులుగా మారారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ.. వాహనం నడిపే వ్యక్తులకు సరైన నిద్ర ఉండట్లేదని తమ విచారణలో తెలుస్తోందన్నారు. డ్రైవర్లు నిద్రలేమితో వాహనాలు నడపొద్దని సూచించారు.
Similar News
News September 12, 2025
NLG: ‘డ్వాక్రా’కు బతుకమ్మ కోక!

ఇందిరమ్మ చీరల పేరుతో SHG సభ్యులకు ఒక్కొక్కరికి రెండు చీరలను ఈ నెల 22 నుంచి ఉచితంగా అందించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది బతుకమ్మ చీరల పంపిణీ నిలిపివేసింది. దీంతో విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఏడాది పొదుపు సంఘాల మహిళలకు చీరలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. నల్లగొండ జిల్లాలో 3,66,532 మంది SHG సభ్యులు ఉన్నారు. వీరికి రెండు చీరలు చొప్పన ఇచ్చేందుకు జిల్లా అధికారులు ఇండెంట్ పంపారు.
News September 12, 2025
నల్గొండ: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

నల్గొండ మండలం మేళ్ల దుప్పలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకట్ మృతి చెందాడు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
News September 12, 2025
నల్గొండ: ఉద్యోగాలకు సాధనకు 15న ఆమరణ నిరాహార దీక్ష

రెండు లక్షల ఉద్యోగాల సాధనకు ఈనెల 15న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు నిరుద్యోగుల హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు పాలకూరి అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించిన వాల్ పోస్టర్లను హైదరాబాద్‌లో గురువారం ఎంపీ ఆర్ కృష్ణయ్యతో కలిసి ఆవిష్కరించారు. అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నిరాహార దీక్షకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతు ప్రకటించాలని కోరారు.