News December 25, 2025

సూర్యాపేట: 2025 రిపోర్ట్.. తగ్గిన నేరాలు

image

పోలీస్ శాఖ వార్షిక నివేదిక-2025ను ఎస్పీ నరసింహ విడుదల చేశారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం నేరాలు 12శాతం తగ్గాయి. గతేడాది 536 చోరీ కేసులు నమోదు కాగా అవి ఏ సంవత్సరం 360గా ఉన్నాయి. పోయినేడు 84 లైంగిక దాడుల కేసులు నమోదవగా ఈ సంవత్సరం 45 కేసులు ఫైలయ్యాయి. 2024లో 622 రోడ్డు ప్రమాదాల్లో 278 మంది చనిపోగా, ఈ ఏడాది 563 యాక్సిడెంట్లలో 204 మంది మృత్యువాత పడ్డారు. 26శాతం రోడ్డు ప్రమాద మరణాలు తగ్గాయి.

Similar News

News December 26, 2025

DRDEలో పెయిడ్ ఇంటర్న్‌షిప్

image

<>DRDO <<>>పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(DRDE) 8 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. 28ఏళ్ల లోపు అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి జనవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. MSc బయాలజికల్ సైన్స్, కెమిస్ట్రీ (3rd/4th సెమిస్టర్) , బీఈ/ బీటెక్(7th/8th సెమిస్టర్) చదువుతున్నవారు అర్హులు. ఎంపికైనవారికి నెలకు రూ.5వేలు స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News December 26, 2025

కామారెడ్డి: రైలు కిందపడి మేస్త్రి సూసైడ్

image

కామారెడ్డిలోని రైల్వే స్టేషన్ సమీపంలో <<18676085>>రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య<<>> చేసుకున్నాడు. రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన తమ్మిశెట్టి కన్నయ్య(63) దేవగిరి ఎక్స్‌ప్రెస్ కిందపడి చనిపోయాడు. మృతుడు 30 ఏళ్లుగా కామారెడ్డిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News December 26, 2025

విజయవాడ: ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు

image

ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దర్శనానికి శుక్రవారం భక్తులు భారీగా తరలివచ్చారు. పెరిగిన రద్దీ దృష్ట్యా EO వీకే సీనా నాయక్ స్వయంగా క్యూ లైన్లను పర్యవేక్షించారు. వైర్లెస్ సెట్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా సిబ్బందికి సూచనలు జారీ చేశారు. సర్వదర్శనానికి ప్రాధాన్యత ఇచ్చి, భక్తులకు త్వరిత దర్శనం కల్పించామన్నారు.