News March 25, 2025
సూర్యాపేట: CM రేవంత్ రాక.. సభా ఏర్పాట్ల పరిశీలన

CM రేవంత్ ఈ నెల 30 ఉగాదిన సూర్యాపేట జిల్లా HNRకు రానున్నారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇచ్చే పథకాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News March 28, 2025
సీఎం అంటే మర్యాద లేదా?.. స్టాలిన్ ఆగ్రహం

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్షంపై సీఎం స్టాలిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపరిస్థితులపై చర్చకు AIADMK వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టగా స్పీకర్ తిరస్కరించారు. వారు పట్టుబట్టడంతో అధికార పక్షం వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో ప్రతిపక్ష సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం ప్రతిపక్షంపై CM మండిపడ్డారు. ‘CM అనే మర్యాద కూడా లేదా? వేలు చూపిస్తూ ఏకవచనంతో మాట్లాడటమేంటి?’ అని ప్రశ్నించారు.
News March 28, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1050 పెరిగి రూ.83,400లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1140 పెరగడంతో రూ.90,980 వద్ద కొనసాగుతోంది. అటు వెండి ధర కూడా రూ.3000 పెరగడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,14,000గా ఉంది. శుభకార్యాల నేపథ్యంలో బంగారానికి భారీ డిమాండ్ నెలకొంది.
News March 28, 2025
పాలమూరు: ‘వంద గజాల ప్లాటుకు రూ.3,81,26,542 LRS’

MBNR మున్సిపాలిటీ పరిధిలో విచిత్రం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన తిరుపతయ్యకు 100 గజాల స్థలం ఉంది. ఆ ప్లాటుకు రూ.3,81,26,542 LRS చలాన్ వచ్చింది. అవాక్కయిన తిరుపతయ్య వెంటనే మున్సిపల్ అధికారులను సంప్రదించారు. ఇదేంటంటూ వాకబు చేశారు. పొరపాటు జరిగిందంటూ LRSను రూ.12,009కి కుదించారు. అయితే తన పక్కనే ఉన్న 100 గజాల ప్లాట్‌కు రూ.9,380 మాత్రమే వచ్చిందని తిరుపతయ్య తెలిపారు.