News March 27, 2025

సూర్యాపేట: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం NLG, SRPT, BNGR డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.

Similar News

News September 16, 2025

వచ్చే నెల విశాఖకు గూగుల్

image

AP: విశాఖకు వచ్చే నెల గూగుల్ సంస్థ రానుందని నిన్న కలెక్టర్లతో జరిగిన సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమ త్వరలో ఏర్పాటు కానుందన్నారు. కూటమి అధికారం చేపట్టాక ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయని తెలిపారు. అనంతపురంలోని లేపాక్షి, కర్నూలులోని ఓర్వకల్లు మధ్య ప్రాంతం భవిష్యత్‌లో భారీ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు.

News September 16, 2025

ఉమ్మడి ప.గో జిల్లాలో 1063 మందికి టీచర్ ఉద్యోగాలు

image

ఉమ్మడి ప.గో జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు 1063 మందిని విద్యాశాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ, జడ్పీ, గిరిజన సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ల స్కూళ్లలో మొత్తంగా 1074 పోస్టులు నోటిఫై చేయగా.. వీటిలో 1063 పోస్టులకు మెరిట్ కమ్ రిజర్వేషన్ రోస్టర్ నిబంధనల మేరకు అభ్యర్థులను ఖరారు చేశారు. 11 పోస్టులకు అర్హులు లేకపోవడంతో వాటిని భర్తీ చేయలేదు. ఎంపికైన వారిలో 534 మంది పురుషులు, 529 మంది మహిళలున్నారు.

News September 16, 2025

సిర్పూర్ కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లో వందే భారత్ హాల్టింగ్

image

కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే నాగ్పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్‌కు సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లో హాల్టింగ్ కల్పించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ఈనెల 18 నుంచి సికింద్రాబాద్-నాగ్పూర్(20102), ఈనెల 19 నుంచి నాగ్పూర్-సికింద్రాబాద్(201010) ఎక్స్‌ప్రెస్ సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లో అధికారికంగా హాల్టింగ్ అవుతుందని స్పష్టం చేశారు.