News October 24, 2025
సూళ్లూరుపేట: కాళంగి నదిలో వ్యక్తి గల్లంతు

దొరవారిసత్రం(M) పోలిరెడ్డిపాలెం సమీపంలోని కాళంగి నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ST కాలనీకి చెందిన ఎనిమిది మంది కమ్మకండ్రిగ సమీపంలో చేపల వేటకు వెళ్లారు. వారిలో M పోలయ్య(31) చేపలు పడుతూ ప్రమాదవశాత్తు జారిపడి నది ప్రవాహానికి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న సీఐ సంగమేశ్వరరావు, MRO శైల కుమారి, SI అజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వారు NDRF బృందానికి తెలియజేయగా గాలింపు చర్యలు చేపట్టారు.
Similar News
News October 24, 2025
వరి A గ్రేడ్ రకానికి రూ.2,389 మద్దతు ధర

కేంద్ర ప్రభుత్వం రబీ పంటలకు మద్దతు ధర(క్వింటాకు) ప్రకటించింది. వరికి A గ్రేడ్ రకానికి రూ.2389, సాధారణ రకానికి రూ.2369 చెల్లించనున్నారు. మొక్కజొన్నకు రూ.2400, పత్తిపొడవు రకం రూ. 8110, మినుములు రూ.7800, పెసలు రూ.8768, కందులు రూ.8000, జొన్నలు రూ.3699, నువ్వులు రూ.9846, సజ్జలు రూ.2775, రాగులు రూ.4886, వేరుశనగకు రూ.7263 చొప్పున మద్దతు ధరలను ప్రకటించింది. పోస్టర్‌ను JC వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు.
News October 24, 2025
హుజూరాబాద్: బాలిక డెడ్‌బాడీతో MLA కౌశిక్ రెడ్డి నిరసన

హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన <<18088701>>బాలిక వనం శ్రీవర్ష<<>> భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఈరోజు ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కేంద్రం వద్ద సందర్శించి, అనంతరం బాలిక మృతదేహంతో స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బాలిక కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
News October 24, 2025
సిద్దిపేట: తాగి లారీ నడిపిన డ్రైవర్.. పట్టుకున్న పోలీసులు

సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగీలా దాబా చౌరస్తా వద్ద మద్యం తాగి లారీ నడుపుతున్నాడని 100 కాల్‌కు ఫోన్ రావడంతో అప్రమత్తమైన సిద్దిపేట పోలీసులు పరారవుతున్న లారీ డ్రైవర్‌ను పరిగెత్తి పట్టుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌కు సైతం లారీ డ్రైవర్ నిరాకరించాడు. అతి కష్టం మీద డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేయడంతో 500 కెపాసిటీ గల మిషన్ టెస్ట్‌కి 471 శాతం పర్సంటేజ్ రావడంతో పోలీసులు అవాక్కయ్యారు.


