News February 24, 2025
సూళ్లూరుపేట వద్ద BUS బోల్తా

సూళ్లూరుపేట NHపై సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. పాండిచ్చేరి నుంచి విజయవాడ వెళ్తున్న ఈ బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదంలో 17 మంది గాయపడగా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. SI బ్రహ్మనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 9, 2025
రాష్ట్ర విజేతగా ఆదిలాబాద్ జిల్లా జట్టు

నారాయణపేట జిల్లాలో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి 69వ స్కూల్ గేమ్స్ హ్యాండ్ బాల్ అండర్ 17 బాలికల పోటీల్లో ఆదిలాబాద్ జిల్లా జట్టు ప్రథమ స్థానంలో నిలిచిందని డీఈవో రాజేశ్వర్, ఎస్జీఎఫ్ కార్యదర్శి రామేశ్వర్ తెలిపారు. ఆదివారం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఆదిలాబాద్ జిల్లా జట్టు మహబూబ్ నగర్ జిల్లా జట్టుపై 17-7 తేడాతో ఘన విజయం సాధించిందన్నారు. విజేత జట్టుకు పలువురు అభినందనలు తెలిపారు.
News November 9, 2025
జూబ్లీహిల్స్‌లో: ఈరోజు నుంచి బస్తీ నాయకులదే హవా!

ప్రచారం కొద్ది గంటల్లో ముగియనుంది. నియోజకవర్గానికి నాయకులెవరూ వెళ్లరు. ఈ పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం నుంచి ఎన్నికలు ముగిసే వరకు స్థానిక నాయకులు, బస్తీ లీడర్లు కీలకపాత్ర వహించనున్నారు. ప్రధాన పార్టీల నాయకులు కూడా వీరిని కలిసి ఎవరికి ఏమేమి కావాలో తెలుసుకొని వారికి అవసరమైన డబ్బు, బహుమానాలు ఇచ్చే అవకాశముంది. అయితే నేరుగా వారికి ఇవ్వకపోయినా ఇతర నియోజకవర్గం బయట అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
News November 9, 2025
రేపు కలెక్టరేట్‌లో అర్జీలు స్వీకరిస్తాం: కలెక్టర్

పుట్టపర్తి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదివారం తెలిపారు.
ప్రజలకు జిల్లా అధికారులందరూ అందుబాటులో ఉంటారన్నారు. సమస్యలపై వచ్చే అర్జీదారులు అర్జీలు అందించాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాలు, డివిజన్ కేంద్రాలలో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ఆయా పరిధిలో పరిష్కారం కానీ అర్జీదారులు మాత్రమే కలెక్టరేట్‌లో అర్జీలు అందించాలన్నారు.


