News February 7, 2025

సూళ్లూరుపేట హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

రోడ్డు ప్రమాదంలో ఐస్‌క్రీమ్‌లు విక్రయించే వ్యక్తి మృతి చెందిన ఘటన సూళ్లూరుపేటలో గురువారం రాత్రి జరిగింది. బాలాయపల్లి(మం), గొల్లగుంటకు చెందిన చల్లా వెంకటకృష్ణయ్య ఆటోలో ఐస్ క్రీమ్‌లు విక్రయించేవాడు. ఆయన ఐస్‌క్రీమ్‌ ఆటోలో సూళ్లూరుపేటకు వస్తుండగా ఆర్‌టీసీ డిపో సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Similar News

News February 7, 2025

మంత్రి సంధ్యారాణికి మీరిచ్చే ర్యాంక్ ఎంత?

image

మొదటిసారి MLAగా గెలిచిన గుమ్మిడి సంధ్యారాణి చంద్రబాబు క్యాబినేట్‌లో మహిళా& శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే 25 మంది మంత్రుల పనితీరుపై ర్యాంకులు కేటాయించగా సంధ్యారాణికి 19 ర్యాంక్ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో సీనియర్లు అయిన అచ్చెన్నకు 17, అనితకు 20 ర్యాంక్ ఇవ్వగా.. తాజాగా రాజకీయాల్లోకి వచ్చిన కొండపల్లి 3వ ర్యాంక్ సాధించారు. మరి సంధ్యారాణి పనితీరుకు మీరెచ్చే ర్యాంకు ఎంత?

News February 7, 2025

బీసీలకు 42శాతం సీట్లు ఇచ్చేందుకు మేం సిద్ధం: పొన్నం

image

TG: ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కులగణనను తమ ప్రభుత్వం పక్కాగా పూర్తి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు మా పార్టీ సిద్ధం. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగనివ్వం. కులగణనను దేశం మొత్తం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. BRS నేతలు సర్వేలో పాల్గొనలేదు. పైగా అవహేళన చేశారు. వెనుకబడిన వర్గాలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

News February 7, 2025

కరీంనగర్: ఈనెల 17 నుంచి MBA, MCA పరీక్షలు

image

KNR శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని MBA, MCA మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ థియరీ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. ఎన్. వి శ్రీ రంగప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, MCA థియరీ పరీక్షలు 22న, MBA థియరీ పరీక్షలు 24 న ముగియనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

error: Content is protected !!