News July 19, 2024

సెంచరీలతో అదరగొడుతున్న సిక్కోలు క్రికెటర్

image

సిక్కోలుకు చెందిన యువ క్రికెటర్ సుశాంత్ అద్భుతంగా రాణిస్తున్నారు. కడప జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న పోటీల్లో రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో 121, రెండో మ్యాచ్‌లో 107 పరుగులతో వరుసగా సెంచరీలు కొట్టారు. మూడో రోజు కృష్ణా జిల్లాపై 68 పరుగులతో సత్తా చాటారు. పరుగుల వరద పారిస్తున్న సుశాంత్‌ భవిష్యత్తులో ఇండియా టీమ్‌కు ఎంపిక కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

Similar News

News July 6, 2025

SKLM: వ్యాధులు పట్ల అప్రమత్తం అవసరం

image

పెంపుడు జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులు పట్ల అప్రమత్తతో మెలగాలని శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజగోపాలరావు అన్నారు. నేడు ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని శ్రీకాకుళం వెటర్నరీ పోలీ క్లినిక్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంపుడు జంతువుల నుంచి ర్యాబిస్, స్వైన్ ఫ్లూ, యంత్రాక్స్, బర్డ్ ఫ్లూ వంటి వ్యాధులు సంక్రమిస్తాయన్నారు.

News July 6, 2025

శ్రీకాకుళం జిల్లాలో యువకుడు దారుణ హత్య

image

కొత్తూరు మండలం వసప గ్రామ సమీపంలో అర్ధరాత్రి వేళ ఘోర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లుకలాపు మిన్నారావు (21) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ చింతాడ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.

News July 6, 2025

టెక్కలిలో నకిలీ సిగరెట్ల కలకలం!

image

టెక్కలిలో నకిలీ సిగరెట్లు కలకలం రేపాయి. ఒరిస్సా నుంచి విచ్చలవిడిగా వస్తున్న ఈ సిగరెట్లు టెక్కలి మార్కెట్‌లో చాప కింద నీరులా విస్తరించాయి. ప్రధాన సిగరెట్ల కంపెనీలను పోలి ఉన్న వీటిని ఇటీవల కంపెనీ ప్రతినిధులు గుర్తించారు. వీటి ద్వారా ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు. ఒరిస్సా నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ ద్వారా టెక్కలితో పాటు శ్రీకాకుళం, విశాఖకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.