News November 27, 2025
సెంట్రల్ అగ్రికల్చర్ వర్సిటీలో 179 పోస్టులు.. అప్లై చేశారా?

సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (CAU)లో 179 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు DEC 6వరకు అప్లై చేసుకోవచ్చు. హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను DEC 15లోగా పోస్టు చేయాలి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో PhD, PG, NET ఉత్తీర్ణతతో పాటు బోధన/ రీసెర్చ్‌లో అనుభవం ఉండాలి. నెలకు జీతం Prof.కు రూ.1,44,200, Assoc. Prof.కు రూ.1,31,400, asst.Prof. కు రూ.57,700 చెల్లిస్తారు. https://cau.ac.in
Similar News
News November 27, 2025
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో నిన్నటి కన్నా ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.12,550
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము ధర: రూ.11,546
☛ వెండి 10 గ్రాములు: రూ.1662.00
News November 27, 2025
ఆ సమయంలో ఎంతో బాధపడ్డా: మంచు లక్ష్మి

నటి మంచు లక్ష్మి తన కుటుంబంలో జరిగిన విభేదాలపై తొలిసారి స్పందించారు. దేవుడు వరం ఇస్తే కుటుంబం మళ్లీ సంతోషంగా కలిసి ఉండాలని కోరుకుంటానని తెలిపారు. భారతీయ కుటుంబాల్లో గొడవలు సహజమని, కానీ చివరికి అందరూ ఒక్కటిగా ఉండటం ముఖ్యమన్నారు. గొడవల గురించి తాను బాధపడలేదన్న వార్తలు తప్పు అని, ఆ సమయంలో తీవ్రమైన మానసిక వేదన అనుభవించినప్పటికీ బయటపెట్టలేదని తెలిపారు. వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇవ్వడం ఇష్టపడనని అన్నారు.
News November 27, 2025
లోకేశ్ విమాన ప్రయాణాలపై TDP క్లారిటీ.. YCP కౌంటర్

AP: మంత్రి లోకేశ్ విమాన ప్రయాణాలకు ప్రభుత్వ డబ్బులు వాడారన్న విమర్శలపై ఆర్టీఐ వివరాలతో TDP క్లారిటీ ఇచ్చింది. 77 సార్లు ప్రత్యేకంగా విమానాల్లో ప్రయాణించినా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధులు ఉపయోగించలేదని పేర్కొంది. ప్రయాణాలన్నింటికీ లోకేశ్ సొంత సొమ్ము వెచ్చించినట్లు సంబంధిత వివరాలను షేర్ చేసింది. అదే నిజమైతే బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను బయట పెట్టాలంటూ YCP కౌంటర్ ఇచ్చింది.


