News January 30, 2026

సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌లో ఉద్యోగాలు

image

<>సెంట్రల్<<>> ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 27 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ME/MTech, ఎకనామిక్స్/MBA/పబ్లిక్ పాలసీ, BE/BTech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటరాక్షన్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. PROకు నెలకు రూ.1.10L-రూ.1.5L, ROకు రూ.64K-రూ.1.10L, RAకు రూ.45K-రూ.80K చెల్లిస్తారు. వెబ్‌సైట్: vacancy.cercind.gov.in

Similar News

News February 6, 2026

RRR ఉత్తర భాగానికి గ్రీన్ సిగ్నల్

image

TG: Hyd చుట్టూ 162KM మేర నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి సంబంధించిన DPR సిద్ధమైందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. LSలో MP ఈటల రాజేందర్ ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు తెలిపారు. భూసేకరణ వ్యయంలో 50% భారం పంచుకునేందుకు TG అంగీకరించిందన్నారు. రాయల్టీ మినహాయింపు, GSTలోని రాష్ట్ర వాటా చెల్లింపునకూ ఓకే చెప్పిందన్నారు. ఈ ఏడాది CRIF నుంచి రూ.367.17 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

News February 6, 2026

శుక్ర దోషం ఎలా ఏర్పడుతుంది?

image

ఇందుకు చాలా కారణాలున్నాయి. జాతకంలో శుక్రుడు నీచ స్థితిలో ఉండకూడదు. దీనివల్ల దోషం ఏర్పడి శుభ ఫలితాలు తగ్గుతాయి. సౌఖ్యాలు దూరమవుతాయి. శుక్రుడు రాహువు, కేతువు, శని గ్రహాలతో కలిసినా దోషం ఏర్పడుతుంది. ఇది వ్యక్తి నైతికతను, బంధాలను ప్రభావితం చేస్తుంది. జాతక చక్రంలో 6, 8, 12వ ఇళ్లలో శుక్రుడు ఉండటం మంచిది కాదు. ఉంటే అనారోగ్యం, అప్పులు కలుగుతాయి. పూర్వజన్మ కర్మల వల్ల కూడా శుక్ర దోషం ఏర్పడవచ్చు.

News February 6, 2026

జూన్ 1న ఈఏపీసెట్ ఫలితాలు!

image

AP: ఈఏపీసెట్‌కు మార్చి 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. 23న ప్రాథమిక కీ, జూన్ 1న ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొంది. ‘ఈసెట్‌కు మార్చి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్ 23న పరీక్ష, మే 7న రిజల్ట్స్ రిలీజ్ చేస్తాం. ఐసెట్‌కు మార్చి 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2న పరీక్ష, 16 ఫలితాలు ప్రకటిస్తాం’ అని పేర్కొంది.