News August 10, 2024
సెంట్రల్ జోన్ అథ్లెటిక్ పోటీలకు దోర్నాల బాలికల ఎంపిక

దోర్నాలలోని జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులు సెంట్రల్ జోన్ అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు నారాయణరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7వ తేదీ మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన అథ్లెటిక్ పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచారన్నారు. సెప్టెంబరులో జరిగే సెంట్రల్ జోన్ అథ్లెటిక్ పోటీల్లో పాల్గొంటారన్నారు.
Similar News
News February 15, 2026
సింగరాయకొండ: డ్రోన్ల నిఘాలో బీచ్ ఫెస్టివల్

పాకల బీచ్ ఫెస్టివల్‌కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఫెస్టివల్ ప్రాంగణమంతా సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ల నిఘాలో ఉంటుందని ఆయన వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు జరిగేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశామని, సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
News February 14, 2026
సింగరాయకొండ శ్రీ చైతన్యలో విద్యార్థి మృతి

సింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ స్కూల్‌లో ఓ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. ఆరవ తరగతి చదువుతున్న విద్యార్థి హాస్టల్లోని బాత్రూంలో అపస్మారక స్థితిలో పడి ఉండడంతో గమనించిన తోటి విద్యార్థులు యాజమాన్యానికి తెలియజేశారు. వెంటనే విద్యార్థిని హాస్పిటల్‌కి తరలించగా అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 14, 2026
కనిగిరిలో రోడ్డు ప్రమాదం.. 10th విద్యార్థి స్పాట్‌డెడ్.!

కనిగిరిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కనిగిరిలోని ఓ ప్రయివేటు స్కూల్‌లో 10th చదువుతున్న విద్యార్థులు 3 బైకులపై కనిగిరి రైల్వే స్టేషన్ చూసేందుకు బయలుదేరారు. మార్గమధ్యలో ఓ బైక్‌కు ప్రమాదం జరగడంతో కుడుముల ప్రతీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే అదే బైక్‌పై ఉన్న బెల్లంకొండ అనీశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.


