News January 11, 2026

సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీస్ అసిస్టెంట్, వాచ్‌మెన్, సబ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి డిగ్రీ(BSW/BA/BCOM), టెన్త్, 7వ తరగతి అర్హత కలిగిన వారు జనవరి 23వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22 -40 ఏళ్ల మధ్య కలిగి ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://centralbank.bank.in/

Similar News

News February 15, 2026

ఇండియా Vs పాక్.. జట్లు ఇవేనా?

image

ఇవాళ్టి హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇండియా, పాక్ జట్లు రెడీ అవుతున్నాయి. ఎక్కువ మంది స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. జట్ల అంచనా ఇలా..
IND: అభిషేక్, ఇషాన్, తిలక్, సూర్య(C), హార్దిక్, శివమ్ దూబే, రింకూ, అక్షర్ పటేల్, సుందర్/కుల్దీప్, బుమ్రా, వరుణ్.
PAK: అయూబ్, ఫర్హాన్, సల్మాన్ అఘా(C), బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖాన్, ఫహీమ్, షాదాబ్ ఖాన్, షహీన్ అఫ్రీది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్, సల్మాన్ మీర్జా.

News February 15, 2026

రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసాకు ‘2-బకెట్ స్ట్రాటజీ’

image

రిటైర్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ‘2-బకెట్ స్ట్రాటజీ’ బెస్ట్ వే. ఇందులో మీ పెట్టుబడులను ‘సేఫ్’ (FD, EPF, PPF), ‘గ్రోత్’ (ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్) బకెట్లుగా విభజించాలి. రిటైర్మెంట్‌కు దగ్గరయ్యే కొద్దీ రిస్క్‌ను తగ్గించుకుంటూ ప్లాన్ మార్చుకోవాలి. రిటైర్ అయ్యాక కూడా కొంత మొత్తాన్ని గ్రోత్ బకెట్‌లో ఉంచడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అధిగమించొచ్చు.

News February 15, 2026

కోవా బన్ను వివాదం.. బాధితుడికి మంత్రి లోకేశ్ మద్దతు

image

AP: మేడారం జాతరలో <<19121994>>కోవా బన్ను<<>> విక్రయించిన వలి అనే వ్యక్తితో యూట్యూబర్ ప్రవర్తించిన తీరుపై విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే. చాలా మంది వలికి సపోర్ట్‌గా నిలిచారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘వలి.. మీరు ఇలాంటివి భరించాల్సి రావడం బాధాకరం. తెలుగు సమాజంలో సామరస్యం, గౌరవం, సోదరభావం తప్ప మతపరమైన విద్వేషాలకు చోటు లేదు. మిమ్మల్ని త్వరలో కలిసి కోవా బన్ను టేస్ట్ చేస్తా’ అని ట్వీట్ చేశారు.