News February 1, 2026

సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

CSIR-సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ (<>CRRI)<<>>12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు రేపటి నుంచి FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(హిందీ/ఇంగ్లిష్), డిప్లొమా, డిగ్రీ, టెన్త్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుకు ఎక్స్‌సర్వీస్‌మెన్‌‌లు అర్హులు. రాత పరీక్ష, స్కిల్/PT&PAT, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: crridom.gov.in/

Similar News

News February 13, 2026

ఎరాస్మస్ బౌలింగ్ కరెక్టేనా?

image

T20WCలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ విచిత్రమైన బౌలింగ్‌పై చర్చ మొదలైంది. ఇది గల్లీ త్రో బౌలింగ్‌లా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. పాక్ బౌలర్ ఉస్మాన్ తారిఖ్‌ను అనుసరిస్తున్నారేమోనని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ICC 15 డిగ్రీల రూల్‌కు లోబడే అతని బౌలింగ్ ఉందని, మోచేయిని వంచడం లేదని మరికొందరు చెబుతున్నారు. ఏదిఏమైనా అతను(4W) భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు.

News February 13, 2026

వీడని AI భయాలు.. భారీ నష్టాల్లో మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. AI భయాలు ఐటీ రంగాన్ని వీడకపోవడం మొత్తం మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. సెన్సెక్స్ 823 పాయింట్లు నష్టపోయి 82,851 వద్ద, నిఫ్టీ 266 పాయింట్లు కుంగి 25,541 దగ్గర ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్-30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, HDFC బ్యాంక్, ఎయిర్‌టెల్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఇన్ఫీ, TCS, HCL టెక్, టెక్ మహీంద్రా, ఎటర్నల్ భారీ నష్టాల్లో ఉన్నాయి.

News February 13, 2026

SAIలో 323 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(<>SAI<<>>)లో 323 అసిస్టెంట్ కోచ్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిప్లొమా, ఒలింపిక్స్/పారాలింపిక్స్/ఏషియన్ గేమ్స్/ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొన్నవారు, స్పోర్ట్స్ కోచింగ్ సర్టిఫికెట్ కోర్సు, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు అర్హులు. రాత పరీక్ష, కోచింగ్ ఎబిలిటీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sportsauthorityofindia.nic.in