News August 7, 2024
సెంట్రల్ సిల్క్ బోర్డు సభ్యుడిగా ఎంపీ అంబికా

అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు కేంద్ర ప్రభుత్వంలో అరుదైన అవకాశం లభించింది. కేంద్రంలోని ఓబీసీ కమిటీలో సభ్యుడిగా, నలుగురు సభ్యులు ఉండే సెంట్రల్ సిల్క్ బోర్డులో సభ్యుడిగా కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దక్షిణాది రాష్ట్రాల నుండి అంబికా లక్ష్మీనారాయణ ఒక్కడికే ఈ అవకాశం లభించింది. దీంతో ఆయన అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది
Similar News
News February 3, 2026
శాంతి భద్రతలు, ప్రజల ప్రాణ రక్షణే ధ్యేయంగా తనిఖీలు

ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా పోలీసులు విస్తృత స్థాయిలో రాత్రివేళ ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, వాటి పరిసర ప్రాంతాల్లో అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. దేవాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
News February 3, 2026
బండ్లపల్లిలో ఉపాధి హామీ 20 ఏళ్ల స్మృతులు

నార్పల మండలం బండ్లపల్లిలో గ్రామంలో 2005లో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం శిలాఫలకాన్ని ఆమె సందర్శించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 20 ఏళ్ల క్రితం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించినప్పుడు అప్పటి నేతలు దిగిన ఫోటోను ప్రజలకు చూపించారు. మొదటి జాబ్ కార్డ్ హోల్డర్‌కు జాబ్ కార్డ్ అందిస్తున్న ఫోటోను చూసి ఆ గ్రామ ప్రజలు ఎంతో సంతోషించారు.