News March 19, 2025
సెన్సార్లు అమర్చాలని అనకాపల్లి కలెక్టర్ సూచన

పరిశ్రమలలో రసాయనాల లీకేజ్ లను గుర్తించే సెన్సార్లను బయట లోపల అమర్చాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సూచించారు. కలెక్టరేట్లో జిల్లా సంక్షోభ నివారణ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. పరిశ్రమలలో ప్రమాదాలు జరిగితే సమాచారాన్ని వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియ చేయాలన్నారు. జిల్లాలో గల 12 రసాయన పరిశ్రమలలో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు.
Similar News
News March 19, 2025
కడప ZP ఛైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. మార్చి 27వ తేదీ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఛైర్మన్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది. జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజీనామాతో ఇన్‌ఛార్జి జడ్పీ ఛైర్మన్‌గా శారద కొనసాగుతున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఛైర్మన్ పదవి కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో నూతన అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకుంటారనే దానిపైన ఆసక్తిగా మారింది.
News March 19, 2025
దిల్‌సుఖ్‌నగర్‌లో వ్యభిచారం.. నాగమణి దొరికిందిలా! (UPDATE)

దిల్‌సుఖ్‌నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న నాగమణిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డెకాయ్ ఆపరేషన్ చేసి నిందితురాలిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘హలో నాగమణి’ అంటూ వాట్సాప్‌లో విటుల వలే మెసేజ్ చేయడంతో ఆమె దిల్‌సుఖ్‌నగర్‌కు అమ్మాయిని తీసుకొచ్చింది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమీర్‌పేట వాసి నాగమణి సినిమా అవకాశం అంటూ యువతులను వ్యభిచారంలోకి దింపుతున్నట్లు తేల్చారు
News March 19, 2025
దిల్‌సుఖ్‌నగర్‌లో వ్యభిచారం.. నాగమణి దొరికిందిలా! (UPDATE)

దిల్‌సుఖ్‌నగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న నాగమణిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. డెకాయ్ ఆపరేషన్ చేసి నిందితురాలిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ‘హలో నాగమణి’ అంటూ వాట్సాప్‌లో విటుల వలే మెసేజ్ చేయడంతో ఆమె దిల్‌సుఖ్‌నగర్‌కు అమ్మాయిని తీసుకొచ్చింది. ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమీర్‌పేట వాసి నాగమణి సినిమా అవకాశం అంటూ యువతులను వ్యభిచారంలోకి దింపుతున్నట్లు తేల్చారు.