News September 14, 2025
సెప్టెంబరు 17 నుంచి ‘స్వస్థ నారి’ కార్యక్రమం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి ‘స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం. దుర్గారావు దొర తెలిపారు. అక్టోబరు 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళలు, ఆడపిల్లలకు ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Similar News
News September 14, 2025
ఎచ్చెర్ల: రేపు అంబేడ్కర్ యూనివర్సిటీలో NSS వాలంటీర్లు ఎంపిక

ఎచ్చెర్లలో గల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో NSS వాలంటీర్ల ఎంపిక సోమవారం జరుగుతుందని ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ డి. వనజ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వచ్చే ఏడాది దేశ దిల్లీలో జరగనున్న గణతంత్ర దినోత్సవ పేరేడ్‌లో పాల్గొనేందుకు ఎంపికలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్టేట్ యూత్ ఆఫీసర్ సైదా రమావత్ ఆధ్వర్యంలో ఈ ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు.
News September 14, 2025
వనపర్తి: జాతీయ లోక్ అదాలత్‌లో 2,737 కేసులు పరిష్కారం: ఎస్పీ

జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 2,737 కేసులు పరిష్కారమైనట్లు ఎస్పీ గిరిధర్ తెలిపారు. ఇందులో ఐపీసీకి సంబంధించిన 171 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, మోటార్ వెహికల్ యాక్ట్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన 514 కేసులు పరిష్కారమయ్యాయి. 2,007 ఈ-పెట్టీ కేసులు, 45 సైబర్ క్రైమ్ కేసులను పరిష్కరించి, బాధితుల ఖాతాల్లోకి రూ.15,10,698 తిరిగి జమ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
News September 14, 2025
జనగామలో సబ్-జూనియర్స్ కబడ్డీ ఎంపికలు

జనగామ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సబ్-జూనియర్స్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికలు నిర్వహించారు. చాగల్లు జడ్పీహెచ్ఎస్‌లో జరిగిన ఈ ఎంపికలకు 150 మంది బాలురు, 120 మంది బాలికలతో పాటు 30 మంది అఫీషియల్స్ హాజరయ్యారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న స్టేషన్ ఘన్‌పూర్ సీఐ వేణు క్రీడాకారులనుద్దేశించి ప్రసంగించారు. ఈ క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు.