News August 10, 2025
సెప్టెంబర్ 14న విశాఖలో ‘నేషనల్ డాగ్ షో’

సెప్టెంబర్ 14న విశాఖలో గాదిరాజు ప్యాలెస్‌లో ‘నేషనల్ డాగ్ షో’ నిర్వహించనున్నట్లు విశాఖ కెన్నెల్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆర్ & బి జంక్షన్ వద్ద ఆదివారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ డాగ్ షోలో దేశం నలుమూలల నుంచి ఊటి, కోడాయికెనాల్, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కోల్‌కతా, జార్ఖండ్, చత్తీస్‌ఘడ్ వంటి వివిధ ప్రదేశాల నుంచి 50 జాతులు, 300 శునకాలు పాల్గొంటాయన్నారు.
Similar News
News August 12, 2025
విశాఖ: ‘ఆధార్ సీడింగ్ లోపాలను సరిదిద్దాలని ఆదేశం’

ఆధార్ సీడింగ్ లోపాలను సరిదిద్దాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (C.G.R.F)
ఛైర్మన్ సత్యనారాయణ ఆదేశించారు. కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటరమణ ఫిర్యాదుపై మంగళవారం వర్చువల్ విచారణ జరిగింది. విచారణలో ఫిర్యాదుదారు వెంకటరమణ మాట్లాడుతూ.. ఆధార్ సీడింగ్ పొరపాట్లు వల్ల పలువురు పేదలు ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నారని తెలిపారు.
News August 12, 2025
విశాఖ: ‘ప్రారంభోత్సవానికి సిద్ధం కావాలి’

ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న మహిళల ఫ్రీ బస్ పథకాన్ని వృక్ష అతిథులతో ప్రారంభించాలని జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు ఆదేశించారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆర్టీసీ సిబ్బంది సిద్ధం కావాలని అన్నారు. పథకం అమలులో లోపాలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News August 12, 2025
కంచరపాలెంలో కారు ఢీకొని బాలుడి మృతి

కంచరపాలెం సుభాష్ నగర్‌లో మంగళవారం రాత్రి విషాదం నెలకొంది. కారు ఢీకొని 15 నెలల చిన్నారి వర్షిత్ మృతి చెందాడు. ఐటీఐ జంక్షన్ నుంచి ఊర్వశి జంక్షన్ వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. చిన్నారి తండ్రి రాంబాబు ప్లంబర్ చేస్తున్నారు. బాలుడుని కారు ఢీకొట్టిన సమయంలో తండ్రి సమీపంలోనే ఉన్నట్లు సమచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.